TGSRTC: గుడ్ న్యూస్ చెప్పిన టీజీఎస్ ఆర్టీసీ.. టికెట్లపై భారీ రాయితీ ప్రకటన..!
ఆర్టీసీ బస్సుల్లో అక్యూపెన్సీని పెంచడానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పలు మార్గాల్లో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో టికెట్లపై రాయితీని ప్రకటించింది. టీజీఎస్ ఆర్టీసీ రంగారెడ్డి రీజియన్ బీహెచ్ఈఎల్ డిపో పరిధిలో దూర ప్రాంతాల్లకు వెళ్లే బస్సుల్లో రాయితీ ఇవ్వనున్నట్లు ఆర్ఎం శ్రీదేవి ప్రకటించారు. ఈ నిర్ణయంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు, వైసూరు, విజయవాడ, గుంటూరు వెళ్లే వారికి లబ్ధి చేకూరనుంది. బీహెచ్ఈఎల్ నుంచి ఈ మార్గాల్లో నడిచే బస్సుల్లో మాత్రమే రాయితీ వర్తించనుంది. బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన బస్ హైదరాబాద్ నుంచి విజయవాడ రాజధాని బస్సు ఛార్జీ రూ.600 ఉండగా.. దాన్ని రూ.500 తగ్గించారు.
అంటే రూ.150 డిస్కౌంట్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు వెళ్లే బీహెచ్ఈఎల్ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ రూ.530 నుంచి రూ.450 తగ్గించారు. అంటే రూ.80 తగ్గించారు. హైదరాబాద్ నుంచి మైసూరు స్లీపర్ బస్సు ఛార్జీ రూ.2,420గా ఉండగా.. టికెట్ ధరను రూ.1800 లకు తగ్గించారు. అంటే ఒక్కో టికెట్ పై రూ.620 తగ్గించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు ఏసీ స్లీపర్ బస్సుల్లో ఛార్జీ రూ.1440 ఉండగా దాన్ని రూ.1200 తగ్గించారు. అంటే ఒక్కో టికెట్ పై రూ.240 తగ్గించారు. అయితే ఈ ఛార్జీలు బీహెచ్ఈఎల్ నుంచి బయల్దేరే బస్సుల్లో మాత్రమే ఉంటాయి. ఆయా మార్గాల్లో అప్ అండ్ డౌన్ సర్వీసులకు సంబంధించి ఈ ప్రత్యేక రాయితీ ధరలు ఉంటాయని ఆర్ఎం శ్రీదేవి చెప్పారు.

ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి పోటీని తట్టుకోవడానికి రాయితీలు ప్రకటించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సెటిలర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లే ఎక్కువగా ఉంటారు. రాయితీలు ప్రకటించడం వల్ల వారంతా ఆర్టీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రాయితీ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్ఎం తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని పేర్కొన్నారు. అయితే కరీంనగర్, నిజామాబాద్, మహబూబా నగర్, వరంగల్, ఆదిలాబాద్ మార్గాల్లో కూడా రాయితీ ఇస్తే బాగుంటుందని నెటిజన్లు కోరుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications