Kalahridhaan trendz: నేడు దేశీయంగా స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకులతో మెుదలై నష్టాల్లోకి జారుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే క్రమంలో మార్కెట్లోని పెట్టుబడిదారులు మాత్రం ఒక స్మాల్ క్యాప్ స్టాక్ కొనేందుకు ఎక్కువగా ఆసక్తి చూపటం అందరి దృష్టిని ప్రస్తుతం ఆకర్షిస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎక్కువగా కొంటున్న స్మాల్ క్యాప్ స్టాక్ కలహరిధన్ ట్రెండ్జ్ లిమిటెడ్ గురించే. కంపెనీ షేర్లు నేడు ఇంట్రాడేలో బలమైన కొనుగోళ్లను చూడటంలో షేర్లు 20% అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇదే క్రమంలో స్టాక్ ధర రూ.62.60 స్థాయికి చేరాయి. వాస్తవానికి నేడు కంపెనీ షేర్ల భారీ పెరుగుదలకు కారణం బంగ్లాదేశ్ నుంచి కంపెనీ పెద్ద వర్క్ ఆర్డర్ పొందటమేనని తెలుస్తోంది.

కంపెనీ తన కొత్త ఆర్డర్ బుక్ అప్‌డేట్ గురించి వెల్లడించటంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బంగ్లాదేశ్‌కు చెందిన కంపెనీ నుంచి రూ.115 కోట్లు మాన్యుఫ్యాక్చరింగ్ ఆర్డర్ అందిందని స్మాల్ క్యాప్ కంపెనీ తెలిపింది. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లోబల్ ఫ్యాషన్ బ్రాండ్ బెక్సికార్ప్ నుంచి ఈ ఆర్డర్ అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. వాస్తవానికి BeximCorp ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫ్యాషన్ బ్రాండ్‌లకు ప్రముఖ తయారీదారుగా కొనసాగుతోంది.
బంగ్లాదేశ్ టెక్స్‌టైల్ పరిశ్రమ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ కాంట్రాక్టు వచ్చినప్పటికీ.. కంపెనీ చరిత్రలో అతిపెద్ద ఆర్డర్ గా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్డర్ రాబోయే సంవత్సరాల్లో బంగ్లాదేశ్ టెక్స్‌టైల్ ఆధిపత్యం తగ్గడానికి దారితీయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సదవకాశాన్ని కలహరిధన్ ట్రెండ్జ్ లిమిటెడ్ చాకచక్యంగా ఉపయోగించుకుంది. ఇది భారతదేశానికి ప్రపంచ వస్త్ర మార్కెట్‌లో ప్రముఖ సరఫరాదారుగా అవతరించడానికి కొత్త అవకాశాలను తెచ్చిపెట్టనుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం స్మాల్ క్యాప్ కంపెనీ ఆర్థికంగా బలంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ వార్షిక ఆదాయం 5.5 శాతం పెరిగి రూ.194.31 కోట్లకు చేరుకుంది. ఇది రంగం సగటు ఆదాయ వృద్ధి కంటే చాలా ఎక్కువ. కంపెనీ వార్షిక నికర లాభం 20.89 శాతం పెరిగి రూ.8.05 కోట్లకు చేరుకుంది.


Click it and Unblock the Notifications