Textile Multibagger: దేశీయ స్టాక్ మార్కెట్లలో కొన్ని నెలలుగా కొనసాగుతున్న ర్యాలీ అనేక మల్టీబ్యాగర్ కంపెనీల పుట్టుకకు ఆజ్యం పోసింది. ఈ క్రమంలో ఒక టెక్స్‌టైల్ స్టాక్ తన పెట్టుబడిదారులను లక్షాధికారులుగా మార్చేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ట్రైడెంట్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. టెక్స్‌టైల్ రంగంలో కంపెనీకి మంచి గుర్తింపు ఉంది. గడచిన పదేళ్ల కాలంలో కంపెనీ స్టాక్ ఇన్వెస్టర్లకు ఊహించని రాబడులను అందించింది. ఈ క్రమంలో 3600 శాతానికి పైగా రాబడిని అందించింది. ఈ లెక్కన ఎవరైనా ఇన్వెస్టర్ ఆ సయమంలో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే దాని విలువ రూ.40 లక్షలకు మించి ఉండేది.

అలాగే గడచిన 5 ఏళ్ల కాలాన్ని పరిశీలిస్తే మల్టీబ్యాగర్ స్టాక్ తన ఇన్వెస్టర్లకు ఏకంగా 500 శాతానికి పైగా రాబడిని అందించింది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.22,570 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.52.90 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.25.05 వద్ద కొనసాగుతోంది. 2019 డిసెంబర్ 27న స్టాక్ ధర రూ.6.65గా ఉంది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీలో ప్రమోటర్ల వాటా 73 శాతానికి పైగా ఉంది.
కంపెనీ టవల్స్, నూలు, రసాయనాల తయారీ వ్యాపారంలో ప్రముఖ సంస్థగా కొనసాగుతోంది. కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ కంపెనీలు సైతం సానుకూలంగా ఉన్నాయి. నేడు స్టాక్ ధరను పరిశీలిస్తే మధ్యాహ్నం 12.53 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో రూ.45.05 వద్ద కొనసాగుతోంది. బ్రోకరేజ్ సంస్థల అభిప్రాయం ప్రకారం కంపెనీ షేర్లు రానున్న కాలంలో రూ.48-52 స్థాయికి చేరుకుంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో స్టాప్ లాస్ ధరను రూ.40గా పరిగణించాలని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications