ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా భారత ప్రవేశంపై ఎలాన్ మస్క్ స్పందించారు. భారత్‌లోకి ఈ ఎలక్ట్రిక్ కార్ల ఎంట్రీ పైన నెలకొన్న సందిగ్ధత అప్పుడే తొలగిపోయేలా కనిపించడం లేదు. దిగుమతి సుంకాలు, తయారీ విషయంలో టెస్లా, కేంద్ర ప్రభుత్వం మధ్య ప్రతిష్టంబన కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ కార్ల విక్రయాలపై మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందు దిగుమతి చేసుకున్న కార్లను విక్రయించేందుకు అనుమతిస్తేనే, దేశంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పుతామని వెల్లడించారు.
ఈ మేరకు టెస్లా తయారీ యూనిట్ పైన ఓ ట్విట్టర్ నెటిజన్ ప్రశ్నించగా, ఎలాన్ మస్క్ స్పందించారు. ముందు మా కార్లను విక్రయించడానికి, సర్వీస్ కోసం అనుమతి లభించని పక్షంలో ఏ ప్రాంతంలో కూడా టెస్లా తయారీ ప్లాంటును నెలకొల్పలేమని చెప్పారు. భారత్‌లో టెస్లా విక్రయాలపై మస్క్ గతంలోను పలుమార్లు ఇదే తరహా స్పందించారు. ఆయన చేసిన కొన్ని ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.

భారత ప్రభుత్వం నిబంధనలు, కొన్ని సవాళ్ల కారణంగా భారత్‌లోకి టెస్లా రాక ఆలస్యమవుతోందని మస్క్ గతంలో ట్వీట్ చేశారు. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని మండిపడింది. భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు టెస్లా చాలాకాలంగా తీవ్ర కసరత్తు చేస్తోంది. మొదట విదేశాల్లో తయారైన తమ కార్లు విక్రయిస్తామని, ఆ తర్వాత స్థానికంగా తయారీ యూనిట్ నెలకొల్పుతామని టెస్లా చెబుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం పన్నులు తగ్గాలంటే ఇక్కడే తయారు చేయాలని చెబుతోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications