భారత్‌లోకి టెస్లా.. ఎలాన్ మస్క్ ఏం చెప్పారంటే? చైనాలో కార్లపై ధర భారీగా తగ్గింపు
అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా వచ్చే ఏడాది భారత్‌లో అడుగు పెట్టనుంది. ఈ మేరకు కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ స్వయంగా వెల్లడించారు. వచ్చే ఏడాది టెస్లా కంపెనీ తప్పకుండా భారత్‌లో అడుగు పెడుతుందని సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ మేరకు టెస్లా ఆగమనాన్ని భారత అభిలాషిస్తోందని సందేశం ఉన్న టీషర్ట్ ఫోటోను టెస్లా క్లబ్ ఇండియా ట్వీట్ చేయగా, ఎలాన్ మస్క్ రీట్వీట్ చేశారు. టెస్లా ఇండియాకు రానుందని చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

గతంలోనే ఎలాన్ మస్క్ ప్రకటన
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వినియోగాన్ని ప్రోత్సహించడంపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీ భారత్‌కు రానుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. టెస్లాను ఇండియాకు తీసుకువచ్చే అంశంపై ఎలాన్ మస్క్ గత ఏడాది మార్చి నెలలో, ఈ ఏడాది జూలైలో స్పందించారు. ఈ సంవత్సరం తాము భారత్‌లోకి ప్రవేశించాలని కోరుకుంటున్నామని, ఇప్పుడు కుదరని పక్షంలో వచ్చే ఏడాదైనా కచ్చితంగా భారత్‌కు వచ్చి తీరుతామని గతంలో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఇండియా వాంట్స్ టెస్లా సందేశంతో కూడిన టీ-షర్ట్‌ను పోస్ట్ చేశారు.

హార్లే డేవిడ్‌సన్, జనరల్ మోటార్స్ ఔట్.. టెస్లా ఇన్
భారత్‌లో మీ ప్రణాళికల పురోగతి ఎక్కడ వరకు వచ్చిందనే ప్రశ్నకు ఎలాన్ మస్క్ బదులిస్తూ.. వచ్చే ఏడాది కచ్చితంగా అడుగు పెడతామన్నారు. అమెరికాకు చెందిన హార్లే డేవిడ్‌సన్, జనరల్ మోటార్ వంటి సంస్థలు భారత్ నుండి వొదులుగుతున్నట్లు ప్రకటించాయి. ఫోర్డ్ కూడా సొంతంగా కార్యకలాపాలు నిలిపివేసింది. మహీంద్రా అండ్ మహీంద్రాతో కలిసి ఏర్పాటు చేసిన సంస్థకు ఫోర్డ్ తన తయారీ ప్లాంటును, ఇతర ఆస్తుల్ని విక్రయించింది. ఇలాంటి పరిస్థితుల్లో టెస్లా అడుగు పెడతానని చెబుతోంది.

ఆలస్యానికి కారణం..
భారత మార్కెట్లోకి టెస్లా అడుగు పెట్టడంలో ఆలస్యానికి భారత్‌లోని నిబంధనలు కారణమని కూడా గతంలో ఎలాన్ మస్క్ చెప్పారు. బెంగళూరులో పరిశీధన-అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పేందుకు కూడా టెస్లా సంప్రదింపులు జరుపుతోంది. ఇదివరకు చైనాకు ఎగుమతి చేసిన టెస్లా.. ఇప్పుడు షాంఘై ఫ్యాక్టరీ నుండి ఎలక్ట్రానిక్ కార్లు ఉత్పత్తి చేస్తున్నారు. షిప్పింగ్ ఖర్చులు, టారిఫ్ తగ్గడంతో ఇటీవల టెస్లా.. చైనాలో విక్రయించే మోడల్ 3 సెడాన్ కారు ధరను 271,550 యువాన్ల నుండి 249,900 తగ్గించింది.


Click it and Unblock the Notifications