ఎలక్ట్రిక్ వాహనాలను భారత్‌లో తయారు చేస్తే ఈ వాహనాలు తయారు చేసే టెస్లాకు కూడా ప్రయోజనకరమని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో పెట్రోల్ వాహనాల ధర కంటే ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తక్కువగా ఉండే రోజులు మరెంతో కాలం లేదన్నారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ తన ఎలక్ట్రిక్ వాహనాలను చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయిస్తామని భావిస్తున్నారు. దీనికి భారత ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక్కడే తయారు చేయాలని చెబుతోంది.
దేశంలో పెట్రోల్ వాహనాల వ్యయంతో పోలిస్తే అన్ని విద్యుత్ వాహనాల ధరలు తక్కువకు లభించే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు గడ్కరీ. ఎలాన్ మస్క్ భారత్‌లో తయారీకి సిద్ధంగా ఉంటే తమకు సమస్య లేదన్నారు. ఇక్కడ తయారీ ప్రారంభిస్తే చాలా ప్రయోజనమని, భారత్ చాలా పెద్ద మార్కెట్ అని, భారత్ నుండి ఎగుమతులు కూడా చేసుకోవచ్చునని చెప్పారు. కానీ చైనా నుండి మాత్రం కార్లను దిగుమతి చేసుకోరాదన్నారు.

ముందుగా భారత్‌లో తయారీని ప్రారంభిస్తేనే ఏవైనా పన్ను మినహాయింపులు పరిశీలిస్తామని గతంలోనే గడ్కరీ చెప్పారు. ప్రస్తుతం పూర్తిగా తయారైన వాహనాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ 60 శాతం నుండి 100 శాతంగా ఉంది. ఇంజిన్ పరిమాణం, వ్యయం, ఇన్సురెన్స్, ట్రాన్సుపోర్ట్ వ్యాల్యూ ఆధారంగా ఉంది. 40,000 డాలర్లకు పైగా ఉండే వాహనాలపై దిగుమతి సుంకం 110 శాతంగా ఉందని, ఇది ఉద్గారరహిత వాహనాలపై నిషేధం విధించడం వంటిదని గతంలో టెస్లా పేర్కొంది. విద్యుత్ కార్లపై టారిఫ్‌ను 40 శాతానికి చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సీఎస్ఆర్‌ను కూడా ఉపసంహరించారలని కోరింది.
More From GoodReturns

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు



Click it and Unblock the Notifications