బీజింగ్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఎలక్ట్రికల్ వాహనాల తయారీ సంస్థ టెస్లా (Tesla) కొత్తగా రూపొందించిన రెండు మోడళ్ల కార్లను వెనక్కి పిలిపించనుంది. ఈ రెండు మోడళ్లు కూడా చైనాలో తయారైనవే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనా రెగ్యులేట్స్ ఆదేశాల మేరకు వాటిని రీకాల్ చేయనున్నట్లు తెలిపింది టెస్లా కంపెనీ యాజమాన్యం. ఈ రెండు మోడళ్లను కొనుగోలు చేసిన వారు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ కారణంతోనే రీకాల్ చేసినట్లు స్పష్టం చేసింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ టెస్లా.ఎలక్ట్రానిక్ వాహనాలను తయారు చేయడంలో టాప్ ఆటొమొబైల్ కంపెనీగా పేరు సాధించింది.
చైనాలో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. మోడల్ 3, మోడల్ వై కార్లు చైనాలోనే తయారయ్యాయి. మోడల్ 3 కారు ధర భారత్‌లో 60 లక్షల రూపాయలు ఉంటోంది. కాగా. మోడల్ వై ప్రైస్ 50 లక్షలకు పైమాటే. ఈరెండు మోడల్స్‌ను టెస్లా కంపెనీ యాజమాన్యం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. ఈ రెండు మోడళ్ల కార్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉన్నందున.. వాటిని రీకాల్ చేసినట్లు టెస్లా తెలిపింది. మొత్తం 2,49,855 కార్లను రీకాల్ చేసినట్లు పేర్కొంది.

కొనుగోలుదారులు వాటిని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని, సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుని, మళ్లీ తిరిగి పొందవచ్చని స్పష్టం చేసింది. సడన్ యాక్సిలరేషన్ సమస్యలు ఉన్నందున దాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలని చైనా రెగ్యులేటర్స్ ఆదేశించినట్లు తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ చేసుకోవడం వల్ల ఈ సమస్య తొలగిపోతుందని పేర్కొంది. ఈ రెండు మోడళ్లను తొలిసారిగా షాంఘైలో తయారు చేస్తోంది టెస్లా కంపెనీ. ఒక్క మేలోనే 33,463 కార్లు అమ్ముడుపోయినట్లు తెలిపింది. ఈ రెండింటికీ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్నట్లు వివరించింది.

More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications