Tesla News: చాలా కాలంగా అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజ తయారీదారు ఇండియాలోకి అడుగుపెట్టాలని చూస్తోంది. అయితే 100 శాతం దిగుమతి సుంకం పెద్ద అవరోధంగా ఉందని మస్క్ వెల్లడించారు. అయితే ప్రస్తుతం ప్రయత్నాలతో మళ్లీ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఈ క్రమంలో ఎలాన్ మస్క్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ టెస్లా ఈ ఏడాది భారతీయ ఆటో విడిభాగాల తయారీ కంపెనీల నుంచి 1.7-1.9 బిలియన్ డాలర్ల విలువైన భాగాలను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోందని వాణిజ్య, ఆహార సరఫరా శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. గత ఏడాది టెస్లా ఇండియా నుంచి సుమారు 1 బిలియన్ డాలర్ల విలువైన ఆటో విడిభాగాలను దిగుమతి చేసుకుంది.

ఆటోమోటివ్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్(ACMA) వార్షిక సమావేశంలో పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ టెస్లా దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే రెట్టింపు కానున్నాయని వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలే భవిష్యత్తు అని నమ్ముతున్నానని పీయూష్ గోయల్ అన్నారు. దేశ జీడీపీలో స్థానిక ఆటో విడిభాగాల పరిశ్రమ 2.3 శాతం వాటాను కలిగి ఉందని వెల్లడించారు. 2025 నాటికి ఆటో కాంపోనెంట్స్‌లో భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
టెస్లా దేశంలో పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. కానీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల దిగుమతులపై 100 శాతం పన్నును భారత ప్రభుత్వం విధిస్తోంది. టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టే ముందు దీనిని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే ఇటీవల జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కలిశారు. టెస్లా భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నారని సమావేశం అనంతరం ఎలోన్ మస్క్ ఇచ్చిన ప్రకటనలో తెలిపారు.
టెస్లా పెట్టుబడికి సంబంధించి టెస్లా - భారత ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఎలాన్ మస్క్ భారతదేశంలో టెస్లా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అయితే దిగుమతి చేసుకున్న ఎలక్ట్రిక్ వాహనాలపై కస్టమ్ డ్యూటీలో మినహాయింపు ఇవ్వాలని టెస్లా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌ను భారత ప్రభుత్వం తిరస్కరిస్తూ వస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications