ఎలాన్ మస్క్ కార్ల కంపెనీ 'టెస్లా' ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా లాంఛ్ చేసిన 'సైబర్‌ట్రక్' త్వరలోనే దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరనుంది. ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్ 2020లో తమ అధికారిక వాహన శ్రేణిలో చేరబోతోందని తెలుపుతూ దానిపై తమ లోగోలను ముద్రించిన ఫోటోను ట్విటర్‌లో దుబాయ్ పోలీసులు పోస్ట్ చేశారు. దుబాయ్ పోలీసుల వాహన శ్రేణిలో చేరిన ఘనతను సాధించిన తొలి టెస్లా కారుగా 'సైబర్‌ట్రక్' రికార్డు సృష్టించింది.
ఇప్పటికే దుబాయ్ పోలీసులు తమ వాహన శ్రేణిలో.. బుగాట్టి వెర్యాన్, ఆస్టన్ మార్టిన్ వన్-77, బీఎండబ్ల్యూ ఐ8, ఫెరారి లాఫెరారి, లాంబోర్గిని అవెంటడార్, లైకాన్ హైపర్‌స్పోర్ట్ వంటి కార్లను ఉపయోగిస్తున్నారు. తాజాగా వీరి వాహన శ్రేణిలో టెస్లా కంపెనీకి చెందిన 'సైబర్‌ట్రక్' కూడా వచ్చి చేరనుంది.

అత్యంత దృఢమైన ట్రక్ అన్నారు, కానీ...
గత గురువారమే టెస్లా తన 'సైబర్‌ట్రక్'ను అట్టహాసంగా లాంఛ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఆ కంపెనీ సీఈవో ఎలాన్ మస్క్ దానిని ఆవిష్కరిస్తూ.. తమ కొత్త వాహనం చాలా గట్టిదని వ్యాఖ్యానిస్తూ.. కావాలంటే మీ సమక్షంలోనే ఈ ట్రక్ దృఢత్వాన్ని పరీక్షిస్తామంటూ సవాల్ విసిరారు. దీంతో ఆ కార్యక్రమానికి విచ్చేసిన అహూతులు ఆశ్చర్యపోయారు. అనంతరం ఆ ట్రక్‌ను డిజైన్ చేసిన డిజైనర్ స్వయంగా వేదికపై ఆ ట్రక్ దృఢత్వాన్ని పరీక్షించారు.
తొలుత గొడ్డలితో ట్రాక్ డోర్‌పై బలంగా మోదగా ఆ ట్రక్ డోర్ కించిత్ కూడా డ్యామేజ్ కాలేదు.దీంతో అక్కడున్నవారందరూ చప్పట్లు కొట్టారు. దాని అద్దం కూడా చాలా గట్టిదని, ఎంత కొట్టిన పగలదని మళ్లీ ఎలాన్ మస్క్ ప్రకటించగా.. సదరు డిజైనర్ ఓ మెటల్ బాల్ తీసుకుని అద్దంపైకి విసిరారు. అద్దమైతే భళ్లున బద్దలుకాలేదు కానీ, క్రాక్ ఇచ్చింది. దీంతో సీఈవో ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది.
నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు...
దృఢత్వం విషయంలో కాస్తంత నిరాశపరిచినా టెస్లా కంపెనీ విడుదల చేసిన 'సైబర్‌ట్రక్'కు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈనెల 22న టెస్లా సైబర్‌ట్రక్‌ను లాంఛ్ చేయగా కేవలం నాలుగు రోజుల్లోనే 1.87 లక్షల ఆర్డర్లు వచ్చాయి. 2020లో టెస్లా ఉత్పత్తిని ప్రారంభించనున్న ఈ ఎలక్ర్టిక్ పికప్ ట్రక్.. సింగిల్ మోటార్, డ్యూయల్ మోటార్, ట్రై మోటార్ అంటూ మూడు వేరియంట్లలో లభిస్తుంది.
సైబర్ ట్రక్ సింగిల్ మోటార్ ధర రూ.30 లక్షలు కాగా, డ్యూయల్, ట్రై వేరియంట్లు వరుసగా రూ37.45 లక్షలు, రూ 52.42 లక్షలు. సెల్ప్ డ్రైవింగ్ ఆప్షన్ (డ్రైవర్ లేకుండా కారు దానంతట అదే పరుగులు పెడుతుంది) కోసం అదనంగా రూ.5 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. ఇక 42 శాతం కస్టమర్లు డ్యూయల్ మోటార్ ట్రక్‌ను, 41 శాతం ట్రై మోటార్ ట్రక్‌ను బుక్ చేసుకోగా, 17 శాతం మంది సింగిల్ మోటార్ వేరియంట్ ట్రక్ బుక్ చేసుకున్నట్లు టెస్లా ఒక ప్రకటనలో తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications