అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా భారతదేశంలో తన ప్రసిద్ధ SUV మోడల్ Yని అధికారికంగా విడుదల చేసింది. చాలా కాలం తర్వాత ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన కంపెనీ టెస్లాతో భారత ఆటోమొబైల్ వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రాలో గల కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్‌లో తన తొలి షోరూంని టెస్లా ప్రారంభించింది. ఈ సందర్భంగా టెస్లా వై వేరియంట్ లో రెండు మోడళ్లను భారత్ లో ప్రవేశపెట్టింది.
మొదటి వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాగా దీని ధర రూ. 60 లక్షలు పై మాటే. రెండవ వేరియంట్ లాంగ్ రేంజ్ RWD, దీని ధర రూ. 69 లక్షలు పై మాటే. ఇవి ఎక్స్ షో రూమ్ ధరలు.. అయితే ఆన్-రోడ్ ధరలు చూసుకుంటే వరుసగా రూ. 61.07 లక్షలు, రూ. 69.15 లక్షలుగా ఉన్నాయి. ఇక కంపెనీ దాని వెబ్‌సైట్‌లో ఈ కార్ల మీద ఫైనాన్సింగ్, EMI లేదా లీజు పథకం గురించి ఎటువంటి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

అయితే కస్టమర్ ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటే పూర్తి మొత్తం నగదు చెల్లించాలని కంపెనీ వెబ్ సైట్ ని బట్టి తెలుస్తోంది.అయితే భారతదేశం వంటి మధ్యతరగతి మార్కెట్‌లో.. వినియోగదారులు వాయిదాలలో కొనడానికి ఇష్టపడతారు. టెస్లా కంపెనీ నగదు ఎంపికతో మాత్రమే ప్రారంభించడం పరిమిత వ్యూహంగా పరిగణించబడుతుంది.
ఇక దీంతో పాటుగా అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో నిర్ణయించిన టెస్లా మోడల్ Y ధర చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కారు అమెరికాలో దాదాపు రూ. 37.5 లక్షలకు లభిస్తుంది. చైనాలో దాదాపు రూ. 30 లక్షలకు లభిస్తుంది. జర్మనీ వంటి యూరోపియన్ దేశాలలో కూడా దీని ధర దాదాపు రూ. 42 లక్షలు. కాని భారతదేశంలో మాత్రం ఈ కారు ధర రూ. 60 లక్షలుగా ఉంది. దీనిని బట్టి ఈ ఎలక్ట్రిక్ SUV కోసం భారతీయ కస్టమర్లు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ధర అంతర్జాతీయ ధరల కంటే 40 శాతం వరకు ఎక్కువ. భారతదేశంలో విధించే దిగుమతి పన్నులు, సుంకాలు వల్ల ఈ ధర ఉందని పలువురు చెబుతున్నారు.
ఈ వై మోడల్ కారు ధర అమెరికా కన్నా భారత్ లో రెండింతలు ఎక్కువ.. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. భారత ప్రభుత్వం టెస్లాకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదనేది ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఈ ధరల వ్యత్యాసానికి ప్రధాన కారణం దేశంలో ఉన్న దిగుమతి సుంకంగా చెప్పుకోవచ్చు. టెస్లా ప్రస్తుతం దేశంలోకి పూర్తిగా తయారైన కార్లను (CBUలు) దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఇవి దేశంలోకి ఎంటర్ కావాలంటే అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే. కారు CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ 40,000 వేల డాలర్లు దాటితే 100 శాతం విధిస్తారు. ఆ పరిమితి కంటే తక్కువ ధర గల కార్లకు 70 శాతం విధిస్తారు.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని గతంలో ఎలోన్ మస్క్ అద్దెకు తీసుకున్నారు. దీనికి టెస్లా దాదాపు రూ.35 లక్షల అద్దె రూపంలో నెలకు చెల్లించనున్నారని సమాచారం. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదు సంవత్సరాల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి అద్దెకు తీసుకుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టర్ కాగా.. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది టెస్లా. ఇక్కడి నుంచే టెస్లా కార్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications