టెస్లా కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ కారును వాయిదాల రూపంలో సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ ఆ ఆప్సన్ ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తం పేమెంట్ ఒకేసారి చెల్లించి కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కారు మొదటి వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాగా దీని ధర రూ. 60 లక్షలు పై మాటే. రెండవ వేరియంట్ లాంగ్ రేంజ్ RWD, దీని ధర రూ. 69 లక్షలు పై మాటే. ఇవి ఎక్స్ షో రూమ్ ధరలు.. అయితే ఆన్-రోడ్ ధరలు చూసుకుంటే వరుసగా రూ. 61.07 లక్షలు, రూ. 69.15 లక్షలుగా ఉన్నాయి.
ఇక కంపెనీ దాని వెబ్‌సైట్‌లో ఈ కార్ల మీద ఫైనాన్సింగ్, EMI లేదా లీజు పథకం గురించి ఎటువంటి సమాచారాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కస్టమర్ ఈ కారును సొంతం చేసుకోవాలనుకుంటే పూర్తి మొత్తం నగదు చెల్లించాలని కంపెనీ వెబ్ సైట్ ని బట్టి తెలుస్తోంది.అయితే భారతదేశం వంటి మధ్యతరగతి మార్కెట్‌లో.. వినియోగదారులు వాయిదాలలో కొనడానికి ఇష్టపడతారు. టెస్లా కంపెనీ నగదు ఎంపికతో మాత్రమే ప్రారంభించడం పరిమిత వ్యూహంగా పరిగణించబడుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే భారతదేశంలో నిర్ణయించిన టెస్లా మోడల్ Y ధర చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ కారు అమెరికాలో దాదాపు రూ. 37.5 లక్షలకు లభిస్తుంది. చైనాలో దాదాపు రూ. 30 లక్షలకు లభిస్తుంది. జర్మనీ వంటి యూరోపియన్ దేశాలలో కూడా దీని ధర దాదాపు రూ. 42 లక్షలు. కాని భారతదేశంలో మాత్రం ఈ కారు ధర రూ. 60 లక్షలుగా ఉంది. దీనిని బట్టి ఈ ఎలక్ట్రిక్ SUV కోసం భారతీయ కస్టమర్లు భారీగా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. ఈ ధర అంతర్జాతీయ ధరల కంటే 40 శాతం వరకు ఎక్కువ. భారతదేశంలో విధించే దిగుమతి పన్నులు, సుంకాలు వల్ల ఈ ధర ఉందని పలువురు చెబుతున్నారు.
ఈ వై మోడల్ కారు ధర అమెరికా కన్నా భారత్ లో రెండింతలు ఎక్కువ.. భారత ప్రభుత్వం టెస్లాకు ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదనేది సమాచారం. ఇక ఈ స్థాయి ధరలకు ప్రధాన కారణం దేశంలో ఉన్న దిగుమతి సుంకంగా చెప్పుకోవచ్చు. టెస్లా ప్రస్తుతం దేశంలోకి పూర్తిగా తయారైన కార్లను (CBUలు) దిగుమతి చేసుకుంటోంది. కాబట్టి ఇవి దేశంలోకి ఎంటర్ కావాలంటే అధిక దిగుమతి సుంకాలు చెల్లించాల్సిందే. కారు CIF (ఖర్చు, భీమా, సరుకు రవాణా) విలువ 40,000 వేల డాలర్లు దాటితే 100 శాతం విధిస్తారు. ఆ పరిమితి కంటే తక్కువ ధర గల కార్లకు 70 శాతం విధిస్తారు.
ముంబైలో తొలి షోరూంని నేడు టెస్లా ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని గతంలో ఎలోన్ మస్క్ అద్దెకు తీసుకున్నారు. దీనికి టెస్లా దాదాపు రూ.35 లక్షల అద్దె రూపంలో నెలకు చెల్లించనున్నారని సమాచారం. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదు సంవత్సరాల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి అద్దెకు తీసుకుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టర్ కాగా.. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది టెస్లా. ఇక్కడి నుంచే టెస్లా కార్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టాయి.
ఇదిలా ఉంటే విన్ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు VF7, VF6 కోసం దేశంలో ఇప్పటికే ఫ్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సమయంలోనే టెస్లా తన ఈవీ కారు వై మోడల్ తో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉంది.అయితే ఈవీ కార్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది. ఎందుకంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై కస్టమర్లలో నిరాశ వ్యక్తం అవుతోంది. వీటికి ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉండటంతో సంపన్న కొనుగోలుదారులు కూడా ఈ కార్ల వైపు మొగ్గు చూపడం లేదు. టెస్లా రాకతో ఈ రంగంలో కూడా పుంజుకునే అవకాశంఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications