కేంద్ర రోడ్డు ట్రాన్సుపోర్ట్ అండ్ హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ టెస్లా ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో కార్లను తయారీ చేసి, భారత్‌లో విక్రయించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని తేల్చి చెప్పారు. కార్లను భారత్‌లోకి దిగుమతి చేసి విక్రయిస్తామని, తమకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు కావాలని టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ కోరుతున్నారు. అయితే భారత్‌లో తయారీ ఉంటేనే తాము ప్రోత్సాహకాలు, రాయితీలు ఇస్తామని, చైనాలో తయారు చేసి, ఇక్కడ అమ్ముతామంటే కుదరదని, ఆ ప్రతిపాదనను తాము అంగీకరించలేమని గడ్కరీ అన్నారు.

ఇక వారిష్టం
ఈ మేరకు గడ్కరీ ఓ మీడియా ఇంటర్వ్యూలో టెస్లా అంశంపై స్పందించారు. మూడు నాలుగు రోజుల క్రితం టెస్లా భారత శాఖ అధినేతతో సంప్రదింపులు జరిపామని, ఆ సమయంలో తాను టెస్లా తయారీ, ప్రోత్సాహకాలు, రాయితీలకు సంబంధించి వివరాలు చర్చించానని అన్నారు. ఇక్కడే తయారీ, ఇక్కడే విక్రయం అయితేనే తాము రాయితీలు కల్పిస్తామని చెప్పామన్నారు. మా ప్రయత్నాలు మేం చేశామని, ఇక నిర్ణయం వారికే వదిలేశామన్నారు. అంటే దేశంలో ఉత్పత్తి చేస్తేనే వారు అడిగిన వాటికి అంగీకరిస్తామని గడ్కరీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

దానిని అంగీకరించం
భారత రోడ్లపై టెస్లా కార్లు తిరగాలంటే మొదట వాటిని ఇక్కడే తయారు చేయాలా అని మీడియా ప్రతినిధి అడగ్గా, గడ్కరీ స్పందిస్తూ, అతని (మస్క్) చైనాలో తయారు చేసి, ఇండియాలో విక్రయించాలని ఆసక్తిగా ఉన్నారని, కానీ మీరు ఇక్కడ ప్రారంభిస్తామంటే మేం స్వాగతిస్తామని, తమకు ఎలాంటి సమస్య లేదన్నారు. కానీ చైనాలో తయారు చేసి, భారత్‌లో విక్రయించడాన్ని తాము అంగీకరించలేమన్నారు.

రాయితీలు, కస్టమ్ డ్యూటీ...
టెస్లా ఎలక్ట్రిక్ కార్ల పైన కస్టమ్స్ డ్యూటీ తగ్గించాలన్న డిమాండుకు అంగీకరిస్తారా అని మీడియా ప్రతినిధి అడగగా, గడ్కరీ స్పందిస్తూ... ఒక ఆటోమొబైల్ కంపెనీ కోసం అలా చేయలేమన్నారు. భారత్ అతిపెద్ద మార్కెట్ అని, బీఎండబ్ల్యు, వోల్వో, మెర్సిడెజ్, బెంజ్, టయోటా, హోండా, హ్యుండాయ్ వంటి దిగ్గజ కంపెనీలు భారత మార్కెట్‌లో ఉన్నాయని చెప్పారు. ఒక కంపెనీకి తాము సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే, మిగతా కంపెనీల మాటేమిటన్నారు. ఇది సమస్యగా మారుతుందన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications