Tesla Gold Car: బంగారంతో కార్లు ఏంటి బాస్ అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వీటిని ఏ కంపెనీ తయారు చేస్తోంది? వీటిని అమ్ముతారా? అసలు వీటి రేటు ఎంతో అనే ప్రశ్నలు మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. అయితే దీనిని తయారు చేస్తోంది మాత్రం ప్రపంచ ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈ కంపెనీ సాధారణంగా ఖరీదైన టెస్లా కార్లను తయారు చేస్తోంది.

రష్యా కంపెనీ..
టెస్లా మోడల్ S ప్లాయిడ్ మోడల్ ఎక్సలెన్స్ 24K కారును టెస్లా పరిచయం చేసిన మాట వాస్తవమే. అయితే ఈ కారును రష్యన్ లక్జరీ కార్ల తయారీదారు కేవియర్ రూపొందించింది. ఈ ప్రముఖ లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ ఇప్పటికే బిలియనీర్లకు సేవలందిస్తోంది. ఇప్పుడు టెస్లా కారును బంగారంతో డిజైన్ చేసింది.

బంగారు పూత..
బంగారు పూతతో తయారు చేయబడిన టెస్లా మోడల్ S కారులో.. రేడియేటర్, గ్రిల్, బంపర్, అద్దాలు స్వచ్ఛమైన 24 క్యారెట్ బంగారు పూతతో తయారు చేయబడ్డాయి. వీటికి తోడు కారు బానెట్, వెనుక బంపర్‌పై బంగారు కిరీటాలను కలిగి ఉంది.

99 కార్లు మాత్రమే..
అత్యంత ఖరీదైన మోడల్ కావడంతో ఈ మోడల్ కార్లు కేవలం 99 మాత్రమే ఉత్పత్తి చేయబడ్డాయి. డబుల్ ఎలక్ట్రోప్లేటింగ్ టెక్నిక్ ఉపయోగించి కారుకు స్వచ్ఛమైన బంగారు పూతను వేశారు. ఈ ఎలక్ట్రిక్ కారు నలుపు, బంగారు రంగుల్లో రూపొందించబడింది. బంగారంతో తయారయిన ఈ స్టాక్ రాయల్ లుక్‌తో వాహన ప్రియులను ఆకర్షిస్తోంది.

కారు ధర ఎంతంటే?
కేవియర్ టెస్లా కార్లకు మరింత అందాన్ని జోడిస్తోంది. అయితే ఈ కారు ధర గురించి స్పష్టమైన ప్రకటన లేదు. అయితే ఈ బంగారు పూతతో కూడిన కారు ధర దాదాపు 3 లక్షల డాలర్లకు పైగా ఉండవచ్చని అంచనా.

ధర పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు..
టెస్లా కార్లు సాధారణంగా ఖరీదైనవి. పైగా ఇది బంగారు పూతతో తయారైన కారు కాబట్టి.. దీని ధర మరింత ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. రానున్న కాలంలో వీటి ఉత్పత్తి సంఖ్యను పెంచవచ్చని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications