వాషింగ్టన్: ఇప్పటిదాకా ఎన్నో వేరియంట్లకు సంబంధించిన కార్లను చూశాం. చివరికి డ్రైవర్ అవసరం లేని కార్లు కూడా వచ్చేశాయి. టాప్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను అభివృద్ధి చేసింది. వాటిని కమర్షియల్ అవసరాల కోసం రోడ్ల మీదికి తీసుకుని రావడమే ఆలస్యం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను మరింత డెవలప్ చేయడంలో భాగంగా.. పలు టెస్టింగ్స్ నిర్వహిస్తోంది గూగుల్ మేనేజ్‌మెంట్. గూగుల్‌కు అనుబంధంగా కొనసాగుతోన్న వేమో దీన్ని రూపొందించింది.

స్టీరింగ్ అవసరం లేని కారు..
ఈ దిశగా మరో అడుగు ముందుకు పడింది. కొత్తగా స్టీరింగ్ వీల్ అవసరం లేని కార్లు కూడా సందడి చేయబోతోన్నాయి. టెస్లా (Tesla) ఆటోమేకర్ దీన్ని తయారు చేస్తోంది. ఇంకో రెండేళ్లలో తొలి కారు ప్లాంట్ నుంచి బయటికి రావడానికి అవకాశం ఉంది. స్టీరింగ్ అవసరం లేకుండా ఈ కారును తయారు చేయాలని టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్.. కంపెనీ ఉద్యోగులకు అధికారికంగా ఆదేశించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను టెస్లా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించినట్లు సమాచారం.

2023 నాటికి..
స్టీరింగ్ వీల్ అవసరం లేని కారు.. ఎలక్ట్రికల్ వెహికల్‌గా తయారు కానుంది. విద్యుత్ ఆధారంగా నడిచే ఈ కారును 2023 ప్రథమార్థం నాటికి ప్లాంట్ నుంచి బయటికి తీసుకుని రావాలనేది టెస్లా మేనేజ్‌మెంట్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ కారు ధరను టెస్లా యాజమాన్యం 25 వేల డాలర్లుగా నిర్ధారించింది. భారతీయ కరెన్సీతో పోల్చుకుంటే 18 లక్షల రూపాయల పైమాటే. కారు బేసిక్ ప్రైస్ ఇది. ఆ తరువాత మోడల్, సౌకర్యాలకు అనుగుణంగా ధరలో పెరుగుదల ఉంటుంది.

25 వేల డాలర్లతో..
టెస్లా బ్యాటరీ దినోత్సవం సందర్భంగా గత ఏడాది నిర్వహించిన ఓ సెమినార్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎలాన్ మస్క్.. ఈ తరహా స్టీరింగ్ వీల్ లేని కారుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను వెల్లడించారు. 25 వేల డాలర్ల ధరతో కూడిన కొత్త ఎలక్ట్రిక్ ఆధారిత కారును తయారు చేయనున్నట్లు ఆయన అప్పట్లోనే ప్రకటించారు. ఇదే కారును ఇక స్టీరింగ్ వీల్ అవసరం లేకుండా తీర్చిదిద్దాలని ఆయన కంపెనీ సిబ్బందిని ఆదేశించినట్లు ఎలక్ట్రెక్.కో అనే వెబ్‌సైట్ తెలియజేసింది.

బ్యాటరీల ఖర్చు తగ్గించడంపై
ఇదే కార్యక్రమం సందర్భంగా ఎలాన్ మస్క్ చేసిన పలు ప్రకటనలు ఇప్పుడిప్పుడే కార్యరూపం దాల్చుతున్నాయి. కార్ల ధరలు భారీగా పెరగడానికి బ్యాటరీ కూడా ఓ కారణమౌతోందని, దీన్ని తగ్గించడంపై తాము దృష్టి సారిస్తామని ఆయన అప్పట్లో ప్రకటించారు. ఇప్పుడు తాజాగా దాన్ని ఇంప్లిమెంట్ చేయనున్నారు. కొత్త బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను నెలకొల్పడం ద్వారా.. ఎలక్ట్రిక్ కార్లకు అవసరమైన బ్యాటరీ సెల్స్‌ను అక్కడి నుంచి సరఫరా చేస్తామని అన్నారు.

50 శాతానికి తగ్గిన ఖర్చు..
ఫలితంగా- అదనపు భారం కంపెనీపై ఉండబోదని, దాన్ని వాహనదారులపై బదలాయించే అవకాశం తమకు రాదని ఎలాన్ మస్క్ ఇదివరకు వ్యాఖ్యానించారు. దీనికి అనుగుణంగా టెస్లా నుంచి బయటికి రాబోయే కొత్త కార్ల బ్యాటరీల ధరలు 50 శాతానికి తగ్గించినట్లు టెస్లా యాజమాన్యం తెలిపింది. దీనివల్లే 2023లో కొత్తగా మార్కెట్‌లోకి తీసుకుని రావడానికి ఉద్దేశించిన స్టీరింగ్ రహిత కారు ధరను 25 వేల డాలర్లుగా నిర్ధారించినట్లు స్పష్టం చేసింది.

రిటైల్ ఎలక్ట్రిక్ ప్రొవైడర్‌గా
టెస్లా గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఒకటైన టెస్లా ఎనర్జీ వెంచర్స్.. అమెరికాలో విద్యుత్ విక్రయ రంగంలో అడుగు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాము ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా వినియోగదారులకు విక్రయించడానికి కసరత్తు పూర్తి చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పబ్లిక్ యుటిలిటీస్ కమిషన్ ఆఫ్ టెక్సాస్‌కు సమర్పించింది. రిటైల్ ఎలక్ట్రిక్ ప్రొవైడర్‌గా తమను గుర్తించాలని విజ్ఞప్తి చేసింది టెస్లా ఎనర్జీ వెంచర్స్ లిమిటెడ్ ప్రతినిధులు. కాగా- ప్రస్తుతం యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియాల్లో టెస్లా ఎనర్జీ వెంచర్స్ రిటైల్ ఎలక్ట్రిక్ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications