Tesla: టెస్లా ఈవీ కార్లు భారత్‌కు వచ్చేశాయి..వై మోడల్ కారు ధర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..

టెస్లా (Tesla) : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)కు భారత వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) తన Y మోడల్ కారుతో ఎట్టకేలకు ఇండియాలోకి అడుగుపెట్టింది. ఈ రోజు ముంబైలోని బాంద్రాలో గల కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లోని మేకర్‌ మ్యాక్సిటీ మాల్‌లో తన తొలి షోరూంని టెస్లా ప్రారంభించింది.

ఈ ఈవెంట్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర గంగాధరరావు ఫడ్నవిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంస్థకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గ్రాండ్ గా వెల్‌కమ్‌ చెప్పారు. భారత్‌లో ఈ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. తయారీ, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌ను కూడా ప్లాన్‌ చేస్తుందని ఆశిస్తున్నట్లు మహా సీఎం తెలిపారు.

ఇదిలా ఉంటే టెస్లా సంస్థ వై మోడల్‌ కార్లను చైనాలోని షాంఘై నగరంలో గల తమ ఫ్యాక్టరీ నుంచి తీసుకొచ్చింది. వీటిని తన తొలి షోరూంలో ప్రదర్శనకు ఉంచింది. ఈ కార్ల అమ్మకాల డిమాండ్ ను బట్టి తర్వాత షోరూం దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tesla first India showroom opens in Mumbai Tesla s first India showroom Mumbai Tesla Tesla Launches Model Y in India Tesla Model Y in India Model Y in India Tesla Model Y Tesla Model Y India launch Tesla Model Y price in India Tesla cars in India electric cars India 2025 Model Y SUV India Tesla EV price Model Y features India Elon Musk Tesla India Tesla India market entry premium electric cars India EV SUV India Tesla bookings India SUV 2025 Tesla first India showroom opens in Mumbai Tesla s first India showroom Mumbai Tesla Tesla Launches Model Y in India Tesla Model Y in India Model Y in India Tesla Model Y Tesla Model Y India launch Tesla Model Y price in India Tesla cars in India electric cars India 2025 Model Y SUV India Tesla EV price Model Y features India Elon Musk Tesla India Tesla India market entry premium electric cars India EV SUV India Tesla bookings India SUV 2025 EV

కాగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్థలాన్ని గతంలో ఎలోన్ మస్క్ అద్దెకు తీసుకున్నారు. దీనికి టెస్లా దాదాపు రూ.35 లక్షల అద్దె రూపంలో నెలకు చెల్లించనున్నారని సమాచారం. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదు సంవత్సరాల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్‌ నుంచి అద్దెకు తీసుకుంది. రెంటల్‌ అగ్రిమెంట్‌ ఫిబ్రవరి 27న రిజిస్టర్ కాగా.. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించింది టెస్లా.

మోడల్ Y కార్లకు టెస్లా ధరను నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దాని వెబ్‌సైట్ ప్రకారం ఈ కారు ధర రూ. 59, 89,000 గా ఉంది. డీజిల్ పెట్రోల్ ఇంధనంతో నడిచే కార్లు భారత్ రోడ్ల మీద చక్కర్లు కొట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇక ప్రీమియం EV కార్ల విభాగంలో టెస్లా బీఎండబ్ల్యూ, మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ కార్లకు సవాల్ విసరనుంది. వీటితో పాటు భారత్ టాప్ ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రాలకు కూడా గట్టీ పోటీ ఇవ్వనుంది. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ గా ఉంది.అయితే ఈవీ కార్ల విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉంది.

ఎందుకంటే ఛార్జింగ్ మౌలిక సదుపాయాలపై కస్టమర్లలో నిరాశ వ్యక్తం అవుతోంది. వీటికి ఛార్జింగ్ స్టేషన్లు చాలా తక్కువగా ఉండటంతో సంపన్న కొనుగోలుదారులు కూడా ఈ కార్ల వైపు మొగ్గు చూపడం లేదు. ఈ పరిస్థితుల మధ్య టెస్లా అధినేత ఎలోన్ మస్క్ చాలా కాలంగా భారతదేశంలోకి తన ఈవీ కార్లతో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. దీనికి తోడు 2030 నాటికి దేశీయ కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల వాటాను 30 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో ఈవీ కార్ల వాటా 4 శాతం ఉంది.

ఇక మరో దిగ్గజం విన్ఫాస్ట్ తన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు VF7, VF6 కోసం దేశంలో ఇప్పటికే ఫ్రీ బుకింగ్స్ ప్రారంభించింది. ఈ సమయంలోనే టెస్లా తన ఈవీ కారు వై మోడల్ తో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టెస్లా మోడల్ Y రియర్-వీల్ డ్రైవ్ కారును రూ. 59.89 లక్షల (69,756 డాలర్లు)గా నిర్ణయించింది. ఇది ఎక్స్-షోరూమ్ ధర. ఇక దాని మరో మోడల్ Y లాంగ్-రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ కారును రూ. 67.89 లక్షల (79,074 డాలర్లు)గా నిర్ణయించింది. ఇది కూడా ఎక్స్-షోరూమ్ ధర.

US అమ్మకపు ధర 44,990 డాలర్లు కాగా చైనాలో ఇది 263,500 యువాన్లు (36,700 డాలర్లు), జర్మనీలో 45,970 యూరోలు (53,700 డాలర్లు)గా ఉంది. ఆగస్టు నుంచి డెలివరీ ప్రారంభం కానుంది. అమెరికాతో పోలిస్తే భారత్ లో ఈ కారు ధర రూ. 28 లక్షలు ఎక్కువగానే ఉండనుంది. ఇక రెండు వేరియంట్లలో రూ.60 లక్షల కారు పరిధి 500 కి.మీ కాగా రెండవ వేరియంట్ పరిధి 622 కి, మీ. దీని ధర రూ. 69.89 లక్షలు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+