Tesla News: టెస్లా మాజీ ఉద్యోగి మనోవేదన.. కంపెనీ కోసం అంత చేసినా చివరకు..
Layoffs News: హాయిగా కుటుంబంతో కలిసి వెళ్తున్న కారు సడన్‌గా నడిరోడ్డుపై ఆగిపోతే ఎలా ఉంటుంది ? చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం కదా. అదేవిధంగా రోజూ పనిచేస్తున్న ఆఫీస్ ఒకరోజు అకస్మాత్తుగా లేఆఫ్స్ ప్రకటిస్తే ఆ ఉద్యోగి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. అలాంటి ఓ టెస్లా ఉద్యోగి తన మనోవేదనను బయటపెట్టాడు. తనకు జరిగిన దారుణాన్ని చెప్పుకుని కృంగిపోయాడు.
ఇటీవల తొలగించబడిన ఓ టెస్లా ఉద్యోగి.. తాను కంపెనీలో ఐదేళ్లపాటు పనిచేసి ప్రొడక్షన్ సూపర్‌వైజర్ అయ్యానని చెప్పుకొచ్చాడు. తనను విధుల నుంచి తొలగించినట్లు వార్త రావడంతో పూర్తిగా షాక్‌లో ఉన్నట్లు వెల్లడించాడు. పనికి హాజరయ్యేందుకు వెళుతుండగా తాను కొలువు కోల్పోయినట్లు ఇ-మెయిల్ వచ్చిందని తెలిపాడు.

ఎవరైనా స్కామర్స్ తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నట్లు భావించానని సదరు ఉద్యోగి చెప్పాడు. ఒకవేళ కంపెనీలో ఎంటర్ అయ్యే వేళ బ్యాడ్జ్ వల్ల ఇబ్బంది ఎదురైతే సిబ్బంది నుంచి సహాయం పొందాలనుకున్నట్లు తెలిపాడు. కానీ ఒక సెక్యూరిటీ గార్డు దానిని జప్తు చేసి, ఉద్యోగాల కోత వల్ల ప్రభావితమయ్యానని చెప్పినట్లు గుర్తు చేసుకున్నాడు. ఈ మొత్తం అనుభవం ఒక పీడకలలా ఉందని ఆ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశాడు.
తాను కంపెనీలో ఉన్నప్పుడు చాలా కష్టపడి పనిచేశానని, సాధ్యమైనంత వరకు సమర్థవంతంగా మరియు ఉత్పాదకంగా ఉండాలని కోరుకున్నానని తెలిపాడు. టెస్లాలో షిఫ్ట్ సమయం చాలా ఎక్కువగా దాదాపు 12 గంటలు ఉండగా.. పనులను పూర్తి చేయడానికి అంతకంటే ఎక్కువసేపు ఉండేవాడినని వివరించాడు. ప్రయాణ సమయాన్ని ఆదా చేయడానికి 2021లో కారులో పడుకోవడం, ఫ్యాక్టరీలోనే స్నానం చేయడం ప్రారంభించినట్లు చెప్పాడు. దాదాపు ఒక సంవత్సరం మొత్తం ఇలానే చేసినట్లు వెల్లడించాడు.


Click it and Unblock the Notifications