ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. మస్క్ సొంత బ్రాండ్ అయిన టెస్లా కార్లకు భారతదేశంలో అపారమైన క్రేజ్ ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుతం టెస్లా కార్లు సామాన్య భారతీయుడికి అందుబాటులో లేని విధంగా అధిక ధరల్లో ఉన్నాయి. అయితే త్వరలోనే ఇండియాలో తక్కువ ధరకు టెస్లా కార్లను తీసుకొస్తామని టెస్లా కంపెనీ చెప్తోంది. ఈ నిర్ణయం వెనుక ఎలాన్ మస్క్ యొక్క వ్యూహం ఏంటి? ఇంత భారీ తగ్గింపుకు కారణాలు ఏమై ఉండవచ్చు ? ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలో టెస్లా కార్లు చాలా కాస్ట్లీ. ఉదాహరణకు టెస్లా ఎంట్రీ-లెవల్ మోడల్ 'Y' ధర దాదాపు రూ.60 లక్షలు ఉంది. టెస్లా ఇండియాలో అత్యధిక ధరలకు అమ్ముడవడానికి ప్రధాన కారణం అధిక దిగుమతి సుంకం (Import Duty). భారతదేశంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై 100% వరకు దిగుమతి సుంకాలు విధించడం జరుగుతుంది. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలలో ఇవి కూడా ఉన్నాయని ఎలాన్ మస్క్ గతంలో అభిప్రాయపడ్డారు. ఈ అధిక సుంకాల కారణంగానే, అమెరికాలో మోడల్ Y ధర కంటే టెస్లా ఇండియాలో దాని ధర దాదాపు 70% అధికంగా ఉంది. అయితే టెస్లా ఇండియా(Tesla India) మార్కెట్ విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలకే ఇక్కడ కార్లు తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది.
టెస్లా ప్లాన్ ఇదే..
ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న చాలా ఎలక్ట్రిక్ వాహనాల (EV) సగటు ధర రూ.22 లక్షల వరకు ఉండగా.. టెస్లా ధర దీనికి మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ధరల వ్యత్యాసం కారణంగానే ఇప్పటివరకు టెస్లా కార్లు ఇండియాలో అంతగా సక్సెస్ అవ్వలేదు. భారతదేశంలో EV అమ్మకాలు మొత్తం కార్ల అమ్మకాల్లో కేవలం 5% మాత్రమే ఉన్నప్పటికీ.. ఈ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతానికి టెస్లా కేవలం 140 యూనిట్ల మోడల్ Yను మాత్రమే విక్రయించింది. ఈ తక్కువ అమ్మకాలతో సంతృప్తి చెందని ఎలాన్ మస్క్.. భారత మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు.
- సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్: టెస్లా ఇండియా ప్రస్తుతం ముంబై, ఢిల్లీ, గురుగ్రామ్ వంటి ప్రధాన నగరాల్లో సూపర్ ఛార్జర్ నెట్‌వర్క్‌ను వేగంగా ఏర్పాటు చేస్తోంది. ఇది యూజర్లకు రేంజ్ గురించిన ఆందోళన తగ్గిస్తుంది.
- స్థానికంగా తయారీ (Local Manufacturing): దిగుమతి సుంకాల భారాన్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే భారతదేశంలోనే అసెంబ్లీ యూనిట్ లేదా తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కూడా స్థానిక తయారీని ప్రోత్సహిస్తోంది. దీర్ఘకాలంలో, టెస్లా ఇండియాలో ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. అలా జరిగినప్పుడు.. కార్ల ధరలు నేరుగా రూ.35 లక్షల రేంజ్‌కు తగ్గవచ్చు.
మస్క్ టార్గెట్ ఇదే..
ఎలక్ట్రిక్ కార్స్ విభాగంలో.. దేశీయంగా టాటా మోటార్స్, మహీంద్రా, వియత్నాంకు చెందిన VinFast వంటి గ్లోబల్ కంపెనీల నుండి పోటీ పెరుగుతోంది. టెస్లా తన ప్రత్యేకమైన టెక్నాలజీని హైలైట్ చేయడం ద్వారా ఈ పోటీని తట్టుకోవాలని చూస్తోంది.
తగ్గకపోయినా తగ్గినట్టే..
ఇకపోతే రాబోయే నాలుగు నుంచి ఐదేళ్లలో ఈ కార్ల ఓనర్లు మూడింట ఒక వంతు (దాదాపు రూ.20 లక్షలు) వరకు తమ ఖర్చులు తగ్గించుకోవచ్చని కంపెనీ చెప్తోంది. దానికి గల మూడు ప్రధాన కారణాలు కూడా వివరిస్తోంది.
- తక్కువ నిర్వహణ ఖర్చులు (Low Maintenance): టెస్లా కార్లకు సర్వీసింగ్ షెడ్యూల్స్ పెద్దగా అవసరం లేదు. చాలావరకు సమస్యలను సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారానే పరిష్కరిస్తారు. దీనివల్ల సాంప్రదాయ కార్లతో పోలిస్తే నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది.
- చార్జింగ్ ఖర్చులో భారీ ఆదా: పెట్రోల్ ధరతో పోలిస్తే టెస్లాను చార్జ్ చేయడానికి అయ్యే ఖర్చు పది వంతు మాత్రమే. దీర్ఘకాలంలో ఇంధనంపై అయ్యే ఖర్చు గణనీయంగా ఆదా అవుతుంది.
- అధిక రీసేల్ విలువ (High Resale Value): సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల ద్వారా కార్లు ఎప్పటికప్పుడు మెరుగవుతాయి. దీనివల్ల వాటి రీసేల్ విలువ చాలా బలంగా ఉంటుంది. ఇది కూడా ఒక రకంగా కస్టమర్లకు ఆర్థిక ఆదానే.
అంటే.. టెస్లా ప్రస్తుతం దాని ప్రొడక్ట్ ధరను తగ్గించకుండా ఓనర్ షిప్ ఖర్చును తగ్గించడం ద్వారా తమ ధరలను సమర్థించుకుంటోంది. కానీ, ఫ్యూచర్లో మాత్రం ఇక్కడే కార్లు తయారీ చేసి అమ్మేందుకు భారీగా ప్లాన్ చేస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications