టెస్లా తొలి కారు భారత మార్కెట్లోకి ఎట్టకేలకు అడుగుపెట్టింది. అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధ్వర్యంలోని ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా (Tesla) తాజాగా తన మొదటి కారును అధికారికంగా భారతదేశంలో డెలివరీ చేసింది. తెలుపు రంగులో ఉన్న టెస్లా మోడల్ వై (Model Y) కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ కొనుగోలు చేశారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ వద్ద ఈ వాహనాన్ని ఆయనకు టెస్లా అందించింది.
మంత్రి ప్రతాప్ సర్‌నాయక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశంలో తొలి టెస్లా కారును తనవంతుగా కొనుగోలు చేయడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. విద్యుత్ వాహనాలపై ప్రజల్లో మరింత అవగాహన పెంచడమే తన ఉద్దేశమని.. ముఖ్యంగా యువతరానికి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రాముఖ్యతను చూపించాలనుకున్నానని ఆయన పేర్కొన్నారు. ఈ వాహనాన్ని తన మనవడికి బహుమతిగా ఇస్తానని తెలిపారు. జూలై 15న ముంబైలో టెస్లా తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించి అధికారికంగా విక్రయాలు మొదలు పెట్టింది.

చైనాలోని షాంఘై ప్లాంట్‌లో పూర్తిగా తయారైన కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లను (CBUs) భారత మార్కెట్‌లోకి దిగుమతి చేస్తూ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. భారత మార్కెట్ కోసం టెస్లా మోడల్ వై SUV ను రెండు వేరియంట్లలో అందిస్తోంది. వీటిల్లో రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 59.89 లక్షలుగా ఉంది. ఈ కారు ఒకసారి ఛార్జింగ్‌తో సుమారు 500 కి.మీ ప్రయాణించగలదు.ఇక లాంగ్ రేంజ్ రియర్-వీల్ డ్రైవ్ ధర రూ. 67.89 లక్షలు. ఇది ఒక్క ఛార్జ్‌తో 622 కి.మీ. వరకు ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
అయితే, టెస్లా భారత మార్కెట్లో ప్రవేశం అంత సులభం కాలేదు. జూలై మధ్యలో బుకింగ్‌లు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు 600కుపైగా ఆర్డర్‌లు మాత్రమే రావడం, ప్రపంచ స్థాయిలో టెస్లా సాధించే వేగంతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఈ ఏడాది భారతదేశానికి 350 నుండి 500 కార్లను మాత్రమే రవాణా చేయాలని సంస్థ యోచిస్తోంది. షాంఘై నుండి సెప్టెంబర్ ప్రారంభంలో వచ్చిన తొలి కన్సైన్మెంట్ ఇప్పటికే ముంబైలో డెలివరీ మొదలుపెట్టింది.ఇక అమ్మకాల విషయానికి వస్తే.. 2025 మొదటి అర్ధభాగంలో రూ. 45 లక్షల నుండి రూ. 70 లక్షల మధ్య ధర కలిగిన కార్లు కేవలం 2,800 యూనిట్లు మాత్రమే అమ్ముడవ్వగా, చైనాకు చెందిన BYD సీలియన్ 7 SUV మాత్రం తక్కువ ప్రారంభ ధరతోనే 1,200 యూనిట్లకు పైగా అమ్ముడవడం గమనార్హం.
భారత మార్కెట్‌లో ఉన్న అధిక దిగుమతి సుంకాలు, ధరలు ఈ వాహనాల విక్రయాలను సవాలు చేస్తున్నాయి. అయినప్పటికీ టెస్లా ప్రవేశం దేశంలో పర్యావరణ హిత రవాణా భవిష్యత్తుకు ఓ వెలుగు అవుతుందని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. ముంబైతో పాటు ఢిల్లీ, పూణే, గురుగ్రామ్‌లలో కూడా టెస్లా మొదటి దశలో డెలివరీలు చేపట్టనుంది. దీని ద్వారా భారతీయ ఆటోమొబైల్ రంగంలో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం వేగవంతం కానుందని అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications