Tesla News: ఎవరి ఊహలకూ అందని పనులు చేయటంలో ఎలాన్ మస్క్ ఎల్లప్పుడూ ముందుంటారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మస్క్ ఇటీవల తన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టారు.
వాస్తవానికి ఏప్రిల్ 22న టెస్లా సీఈవో భారత పర్యటకు రావాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేసిన మస్క్ హడావిడిగా చైనా పర్యటనకు వెళ్లటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు తగ్గటంతో కంపెనీ లాభాలు ఏగంగా 55 శాతం క్షీణించటంతో కంపెనీ ఆందోళనలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే కొన్నేళ్లలో కొత్త తయారీ ప్లాంట్‌లను నిర్మించే ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టెస్లా ప్రకటించింది. దీంతో ఇండియన్ ఫ్యాక్టరీ ప్రాజెక్టును పెండింగ్‌లో పడింది.

టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఆదివారం చైనాను సందర్శించినట్లు సమాచారం. టెస్లాకు చెందిన ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్ ట్రాకింగ్ యాప్ ద్వారా బీజింగ్‌లో దిగినట్లు వెల్లడైంది. ఇది ఎలాన్ మస్క్ ఉపయోగించిన విమానం అని కొన్ని ఆధారాలు ఉన్నాయి. అమెరికాలో తక్కువ ధరకే కార్లను తయారు చేసే ముఖ్యమైన ప్రాజెక్ట్‌ను చేపట్టిన మస్క్ హడావిడిగా చైనాకు వెళ్లటంపై అనుమానాలు కొనసాగుతున్నాయి.
టెస్లా కార్లకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద మార్కెట్ చైనా. ఈ మార్కెట్లో ఫుల్-సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) టెక్నాలజీని ప్రవేశపెట్టడం గురించి చర్చించడానికి సీనియర్ చైనా అధికారులను కలవడం, స్వీయ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేయడానికి చైనాలో సేకరించిన డేటాను పంపడానికి ఆమోదం పొందడం వంటి విషయాలు తాజా పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2021 నుంచి టెస్లా చైనాలో పనిచేస్తున్న తన వాహనాల నుంచి సేకరించిన మొత్తం డేటాను షాంఘైలోని డేటా సెంటర్‌లో నిల్వ చేస్తోంది.
టెస్లా ఆటోపైలట్ సాఫ్ట్‌వేర్‌ను విడుదలకు కస్టమర్ల నుంచి డిమాండ్ ఉన్నప్పటికీ చైనా ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోవడంతో ఇప్పటివరకు దీన్ని చైనాలో ప్రవేశపెట్టలేదు. అయితే చైనాలోని కంపెనీలు మాత్రం తమ స్వంత సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌ను విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో ఇవి టెస్లాను పోటీ నుంచి వెనకపడేలా చేస్తున్నాయి. అందువల్ల దీని గురించి చైనా అధికారులతో మాట్లాడేందుకు మస్క్ తాజా పర్యటన లక్ష్యాల్లో ఒకటిగా ఉంది. టెస్లా త్వరలో చైనీస్ కస్టమర్‌లకు FSDని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎలాన్ మస్క్ ఈ నెల ప్రారంభంలో ట్విట్టర్ ద్వారా వెల్లడించిన తర్వాత తాజా పర్యటన చోటుచేసుకుంది. ఇది వ్యాపారం కోల్పోతున్న వేళ దిద్దుబాటు చర్యల్లో కీలకమైనదిగా మస్క్ పరిగణిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications