Starlink: గత నెలలో ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇండియాకు వస్తున్నట్లు ప్రధాని మోదీని కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. టెస్లా ప్లాంట్ ఇండియాలో ఏర్పాటుకు చర్చలు జరగొచ్చనే ఊహాగానాలు వినిపించాయి. అయితే అప్పట్లో చివరి క్షణంలో తన ప్రయాణాన్ని మస్క్ విరమించుకుని చైనాకు అకస్మాత్తుగా పర్యటించటం పెద్ద నిరాశకు గురిచేసింది. అయితే ప్రస్తుతం మస్క్ పక్కనే ఉన్న ద్వీపం దేశానికి వెళ్లనున్నారు.
టెస్లా, స్పేస్‌ఎక్స్ CEO ఎలాన్ మస్క్ తన స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను అమలు చేయడం కోసం శ్రీలంక వైపు చూస్తున్నారు. మస్క్ తన భారత పర్యటనను రద్దు చేసుకుని, బదులుగా చైనా, ఇండోనేషియాలను సందర్శించిన తర్వాత ఇది జరుగుతోంది. టెక్ బిలియనీర్ ఇటీవల బాలిలో జరిగిన 10వ వరల్డ్ వాటర్ ఫోరమ్‌లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. స్టార్‌లింక్ సేవల కోసం అవకాశాలను అన్వేషిస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని శ్రీలంక ప్రెసిడెంట్స్ మీడియా విభాగం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ఈ సమావేశంలో ప్రెసిడెంట్, ఎలాన్ శ్రీలంక పునరుద్ధరణ, ఆర్థిక సామర్థ్యం,పెట్టుబడికి కొత్త అవకాశాల గురించి చర్చించారు. ఈ కార్యక్రమానికి తొండమాన్ విక్రమసింఘేతో పాటు ఇండోనేషియాకు వెళ్లారు. అక్కడ వారు మస్క్‌తో శ్రీలంక పునరుద్ధరణ, ఆర్థిక సామర్థ్యం, కొత్త పెట్టుబడి అవకాశాల గురించి చర్చించినట్లు వెల్లడైంది. రిమోట్ కమ్యూనిటీలకు కనెక్టివిటీని తీసుకురావడం విద్య, ఆర్థిక అవకాశాలను సమూలంగా మెరుగుపరుస్తుందని వారు చర్చించారు.
మస్క్ తన భారత పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు?
మస్క్ భారతదేశంలో ఏప్రిల్ 20-ఏప్రిల్ 22 తేదీల్లో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. అయితే చివరి క్షణంలో అది రద్దు చేయబడింది. దురదృష్టవశాత్తూ భారీ టెస్లా బాధ్యతల కారణంగా భారతదేశ సందర్శన ఆలస్యం అవుతున్నట్లు ఎలాన్ మస్క్ పర్యటన రద్దుపై స్పందించారు. అయితే ఈ సంవత్సరం చివర్లో సందర్శించడానికి నేను చాలా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. మస్క్ ఈ సందర్శన సమయంలో దాదాపు $2-3 బిలియన్ల EV తయారీ సౌకర్యం, దేశంలో కొన్ని స్టార్‌లింక్-సంబంధిత పరిణామాలను కలిగి ఉన్న పెద్ద ప్రకటనలు చేస్తారని అందరూ భావించారు. న్యూఢిల్లీలోని పలు స్టార్టప్‌లకు చెందిన ఎగ్జిక్యూటివ్‌లను మస్క్ షెడ్యూల్ ప్రకారం కలవాల్సి ఉంది.


Click it and Unblock the Notifications