క్రిప్టో కరెన్సీ గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. ఆల్ టైమ్ గరిష్టంతో మూడు నుండి నాలుగు రెట్లు క్షీణించిన క్రిప్టో మార్కెట్ దాదాపు గత నెల రోజులుగా ఇదే స్థాయిలో కొనసాగుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో కొన్ని క్రిప్టోలు లాభాల్లో, మరికొన్ని నష్టాల్లో ఉన్నాయి. అయితే ఒకటి రెండు క్రిప్టోలు మాత్రం భారీగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో టెర్రా యూఎస్డీ, లూనా క్లాసిక్ ఉన్నాయి. టెర్రా యూఎస్డీ ఓ సమయంలో 180 శాతం, లూనా క్లాసిక్ దాదాపు 60 శాతం ఎగిసిపడింది.
ఈ వార్త రాసే సమయానికి టెర్రా యూఎస్డీ 140 శాతం లాభపడి 0.071010 వద్ద, లూనా క్లాసిక్ 38 శాతం లాభపడి 0.000133 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. ఆ తర్వాత సింథెటిక్స్ 7 శాతం, ఇమ్యూటబుల్ ఎక్స్ 6 శాతం జంప్ చేశాయి. టాప్ క్రిప్టోల్లో మీమ్ కాయిన్ షిబా ఇను దాదాపు పది శాతం క్షీణించి 0.000010కు పతనమైంది.

ప్రపంచ అతిపెద్ద క్రిప్టో బిట్ కాయిన్ విషయానికి వస్తే ఇది 5 శాతం క్షీణించింది. 21,000 డాలర్ల దిగువకు పడిపోయింది. గత ఇరవై నాలుగు గంటల్లో 19883 డాలర్ల వద్ద కనిష్టాన్ని, 21,100 డాలర్ల వద్ద గరిష్టాన్ని తాకింది. ఎథేరియం, బియాన్స్ కాయిన్ ఏడు శాతం చొప్పున నష్టపోగా, ఎక్స్‌ఆర్‌పీ 5 శాతం పడిపోయింది. సోలానా 9 శాతం, కార్డానో 3.5 శాతం, స్టెల్లార్ 5.5 శాతం, డోజీకాయిన్ 9 శాతం క్షీణించాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications