ఎమర్జెన్సీ హెల్త్ సెక్యూరిటీ కోసం రూ.50,000 కోట్లు: RBI కీలక ప్రకటన
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఉధృతమవుతోన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంతదాస్ బుధవారం (మే 5) కీలక ప్రకటన చేశారు. కరోనా అత్యవసర హెల్త్ సెక్యూరిటీ కోసం రూ.50,000 కోట్ల మేర టర్మ్ లిక్విడిటీ సౌకర్యాన్ని ప్రకటించారు. మార్చి 2022 వరకు కరోనాకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు, సేవల కోసం ఈ మొత్తాన్ని ప్రకటించారు.
కరోనా నేపథ్యంలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులకు ఈ వెసులుబాటు కల్పించారు. దీని కింద బ్యాంకులు, వ్యాక్సీన్ తయారీదారులు, వైద్య సదుపాయాలు, ఆసుపత్రులు, రోగులతో సహా సంస్థలకు మద్దతును ఇస్తుంది. ఈ పథకం కింద బ్యాంకులు కోవిడ్ లోన్ బుక్‌ను తీసుకు రావాలి.

అలాగే, ఇండివిడ్యువల్స్‌కు, ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌ను మరోసారి అనుమతి ఇచ్చింది. వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్‌కు సెప్టెంబర్ 30, 2021 వరకు వెసులుబాటు కల్పించింది. మారటోరియం కాలాన్ని మొత్తంగా రెండేళ్ల వరకు పొడిగించవచ్చు.
అలాగే, రూ.500 కోట్ల వరకు ఆస్తి పరిమాణం కలిగిన సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు అనుమతించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ఈసారి రుతుపవనాలు గ్రామీణ డిమాండ్‌కు సానుకూలంగా ఉన్నాయన్నారు.


Click it and Unblock the Notifications