భారతదేశ ఐటీ రాజధాని బెంగుళూరులో ఇల్లు అద్దెకు దొరకాలంటే జేబులు డబ్బులు ఎక్కువగా వదలాల్సిందే.. నగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాలంటే ఉద్యోగి భయపడే పరిస్థితులు బెంగుళూరు నగరంలో ఉన్నాయి. అందుకుని ఎక్కువ శాతం ఉద్యోగులు పీజీల్లో ఉండేందుకు మొగ్గు చూపుతుంటారు. వీకెండ్ సమయాల్లో ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి అంతలా ఎందుకు భయపడుతున్నారంటే.. చాలానే కారణాలు ఉన్నాయి.
సిలికాన్ సిటీలో ఇల్లు దొరకడం చాలా కష్టం. ఒకవేళ ఇల్లు అద్దెకు దొరికినా ముందుగా ఆరునెలల అడ్వాన్స్ యజమానికి ఇవ్వాలి.దీంతో పాటు సెక్యూరిటీ కింద మరికొంత ఇవ్వాల్సి ఉంటుంది.ఇక మెయింటెనెన్స్ ఇతరత్రా ఖర్చులు కలుపుకుంటే నెలకు వచ్చే జీతంలో సగభాగం ఇంటికే పోతుంది. దీంతో ఉద్యోగి జేబుకు గట్టిగానే చిల్లులు పడే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగులు ఇల్లు తీసుకోవడం వదిలేసి పీజీల్లో ఉంటున్నారు. అయితే ఇప్పుడు ట్రెండ్ మార్చారు. బెంగుళూరు నగరంలో ఉద్యోగులు ట్రెండ్ ను మార్చారంటూ సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ట్రెండ్ ఏం మార్చారంటే..ఇల్లు అద్దెకు తీసుకుని తంటాలు పడే బదులు ఆ డబ్బుతో సొంతిళ్లు కొనుక్కోవచ్చని ఆలోచన చేస్తున్నారు. ఒకప్పుడు అద్దె ఇల్లు ఎంతో బెస్ట్ అని భావించిన వారంతా ఇప్పుడు అద్దె ఇల్లు వదిలేసి సొంతిల్లు ప్లాన్ చేస్తున్నారు. అద్దె ఖర్చులు, ఆరు నెలల అడ్వాన్స్, సెక్యూరిటీ డిపాజిట్లు ఇవన్నీ కలుపుకుంటే అయ్యే మొత్తంతో ఇల్లు కొనుగోలు చేయవచ్చనే ప్లాన్ ఉద్యోగులు బెంగుళూరు నగరంలో చేస్తున్నారు.
దీనికి ఇంకా అనేక కారణాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక పోస్టులో యజమాని రూ. 500 ఖరీదు చేసే ల్యాంప్ కోసం రూ.2500 డిపాజిట్లో తగ్గించుకున్నాడని అద్దెదారు వాపోయారు. ఈ ఘటన రామనగొండ హళ్లిలో చోటు చేసుకున్నట్లు పోస్టులో తెలిపారు. ఈ పోస్టులో అద్దె దారు ఇల్లు ఖాళీ చేయాలని యజమానికి చెప్పి డిపాజిట్ తిరిగి ఇవ్వాలని అడిగితే.. యజమాని చెప్పిన దానికి ఒక్కసారిగా షాకయ్యాడు.ఆ వస్తువు పాడయిపోయింది. ఈ వస్తువు పాడయిపోయింది అంటూ.. డిపాజిట్ నుండి దాదాపు లక్షరూపాయలు జమ చేసుకున్నాడని వాపోయారు. నిజానికి అన్ని వస్తువులు బాగున్నా యజమాని పాడయిపోయాయంటూ డిపాజిట్ నుండి ఈ మొత్తాన్ని రికవరీ చేసుకున్నాడని వాపోయాడు.
ఇక మరొక పోస్టులో పెయింటింగ్ ఛార్జీలు మా ఇంటి యజమాని దారుణంగా వసూలు చేశాడంటూ ఓ అద్దెదారు వాపోయారు. ఇంటిలో చేరే సమయంలో వాల్ పేపర్లు అంటించాడని..అయితే ఆ తరువాత ఇల్లు ఖాళీ చేసే సమయంలో వాటిని చించివేసేసరికి పెయింటింగ్ పాడపోయిందన్నారు. దానికి పెయింటింగ్ వేసినందుకు అద్దె దారు నుంచి యజమాని దాదాపు లక్షా యాభై వేల రూపాయలు వసూలు చేశాడని వాపోయాడు. ఈ నేపథ్యంలోనే అందరూ బెంగుళూరు నగరంలో అద్దెకు ఉండటం కంటే ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

దుబాయ్లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications