Gold Price Today: నెలన్నరగా బంగారం ధరలు వరుసగా పెరగటమే తప్ప పెద్దగా తగ్గిందిలేదు. ఒక వేళ వారంలో ఒక్కరోజు తగ్గినా మిగిలిన అన్ని రోజులో ఎంతోకొంత పెరుగుతూపోతోంది. తాజాగా ఎవ్వరూ ఊహించని రీతిలో ఏకంగా 10 గ్రాముల ధర రూ.73 వేలకు చేరువైంది. అంతర్జాతీయ మార్కెట్లలో సైతం నేడు ఔన్స్ ధర సరికొత్త రికార్డు గరిష్ఠాలకు చేరుకోవటం ఆందోళనలు పెంచేస్తోంది.
పసిడి ధరలు భగభగమంటున్న వేళ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాధికి తక్కువ మెుత్తంలో షాపింగ్ చేయాలని చూస్తున్నారు. అయితే షాపింగ్ చేసే ముందు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని తెలుగువారు తమ నగరాల్లో నేటి రిటైల్ ధరలను పరిశీలించాల్సి ఉంది. ఈ క్రమంలో చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.66,700, ముంబైలో రూ.66,750, దిల్లీలో రూ.65,900, కలకత్తాలో రూ.65,750, బెంగళూరులో రూ.65,750, కేరళలో రూ.65,750, వడోదరలో రూ.65,800, జైపూరులో రూ.65,900, పాట్నాలో రూ.65,800, నాశిక్ లో రూ.65,780, అయోధ్యలో రూ.65,900, బళ్లారిలో రూ.65,750, గురుగ్రాములో రూ.65,900 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రిటైల్ ధరలను దేశంలోని ప్రముఖ నగరాల్లో పరిశీలిస్తే.. చెన్నైలో ధర రూ.72,760, ముంబైలో రూ.71,730, దిల్లీలో రూ.71,880, కలకత్తాలో రూ.71,730, బెంగళూరులో రూ.71,730, కేరళలో రూ.71,730, వడోదరలో రూ.71,780, జైపూరులో రూ.71,880, పాట్నాలో రూ.71,780, నాశిక్ లో రూ.71,760, అయోధ్యలో రూ.71,880, బళ్లారిలో రూ.71,730, గురుగ్రాములో రూ.71,880గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.65,750గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.71,730 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీ ధర స్థిరంగా రూ.88,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications