Nagarjuna: దక్షిణ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు నాగ్..!
Akkineni Nagarjuna: తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం సౌత్ ఇండియన్ సినిమా నేడు పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిపోయాయి. ఎంథిరన్, కెజిఎఫ్, కాంతార, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ లాంటి ఎన్నో సినిమాలే ఇందుకు ఉదాహరణలు. ఈ క్రమంలో నటీనటుల పారితోషికాలు భారీగానే పెరిగాయి.
ఇటీవల విడుదలైన జైలర్ సినిమాకు రజనీకాంత్ ఏకంగా రూ.110 కోట్లు పుచ్చుకున్నారు. అలాగే లియో సినిమా కోసం విజయ్ 130 కోట్ల రూపాయలు, భారతీయుడు- 2 చిత్రానికి కమల్ రూ.150 కోట్లు పారితోషికం అడిగారని సినీ వర్గల్లో చర్చ జరుగుతోంది. అన్ని భాషల్లోనూ నటులు పెరిగిన మార్కెట్ తో పాటే తమ కాల్ షీట్ రేట్లను పెంచేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సౌత్ ఇండియన్ సినిమాలో టాప్ రిచెస్ట్ యాక్టర్ ఎవరై ఉంటారా అనే అనుమానం సహజంగానే అందరికీ ఉంటుంది. అయితే ఈ ట్యాగ్ రామ్ చరణ్, రజనీ, మహేష్ బాబు, ప్రభాస్‌లకు మాత్రం దక్కలేదు. దీనిని అందుకున్న హీరో నాగార్జున కావటం గమనార్హం. ఆయన భార్య అమల, పెద్ద కుమారుడు నాగచైతన్య, చిన్న కుమారుడు అఖిల్ సైతం నటీనటులుగా సంపాదిస్తూనే ఉన్నారు. దీనికి తోడు అన్నపూర్ణాస్టూడియోస్ తో పాటు మరిన్ని వ్యాపారాలను నాగ్ కుటుంబం కలిగి ఉంది. దీంతో అక్కినేని నాగార్జున ఆస్తుల విలువ దాదాపు రూ.3,010 కోట్లుగా ఉంటుందని GQ నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం నాగ్ 64వ ఏట సైతం నవయవ్వనంగా కనిపిస్తూ షోహోస్టుగా, నటుడిగా, హీరోగా పనిచేస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల నటప్రస్తానంలో 100కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే రియల్ ఎస్టేట్, సినిమాల నిర్మాణం, ఐపీఎల్ పెట్టుబడులు కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లో రూ.45 కోట్లు విలువైన బంగ్లా, ఖరీదైన కార్లు, కోట్లాది రూపాయల ప్రైవేట్ జెట్‌తో నాగార్జున విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
సౌత్ ఇండియాలో నాగార్జున తర్వాత అత్యంత ధనవంతుడైన నటుడిగా దగ్గుబాటి వెంకటేష్ నిలిచారు. ఆయన ఆస్తి విలువ రూ.2,200 కోట్లుగా అంచనా వేయబడింది. రూ.1,650 కోట్ల ఆస్తులతో తెలుగు సూపర్ స్టార్ చిరంజీవి మూడో స్థానంలో, రూ.1,370 కోట్ల ఆస్తులతో రామ్ చరణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. అయితే ఆశ్చర్యకరంగా రజనీకాంత్ ఆస్తుల విలువ కేవలం రూ.430 కోట్లుగా ఉన్నట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications