Bengaluru News: బెంగళూరు కొన్ని దశాబ్ధాలుగా ఐటీ పరిశ్రమలో పనిచేస్తున్న వారికి పెద్ద కలల ప్రపంచంగా కొనసాగుతోంది. అమెరికా వెళ్లి సెటిల్ అయిన తెలుగు టెక్కీల కంటే బెంగళూరులో జాబ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే ఎక్కువ. ఇండియన్ సిలికాన్ వ్యాలీలో స్థిరపడాలనే కోరిక చాలా మందిలో ప్రస్తుతం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కానీ తెలుగు ఐటీ ఉద్యోగుల్లో మాత్రం ఆందోళన ఇల్లు కొనుగోలుపై కొనసాగుతోంది.
బెంగళూరులో రియల్టీ పరిశ్రమ వేగంగానే వృద్ధి చెందుతోంది. దీనికి కారణం దేశంలోని వివిధ నగరాలకు చెందిన ప్రజలు టెక్ పరిశ్రమలో పనిచేయటం కోసం నగరానికి వలస రావటమే. ఈ క్రమంలో మంచి వేతనం పొందుతూ అక్కడే స్థిరపడాలనుకుంటున్న చాలా మంది బ్యాంకుల్లో లోన్ తీసుకునైనా ఒక ఇల్లు కొనుక్కోవాలని చూస్తున్నారు. అయితే అలాంటివారు ముందుగా ఆందోళన చెందుతోంది నగరంలోని నీటి ఎద్దడి సమస్య గురించే. గడచిన వేసవి కాలంలో బెంగళూరులో పరిస్థితులు దిగజారి కనీస అవసరాలకు సైతం నీళ్ల కొరత ఏర్పడిన సంగతి పెద్ద చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే.

వాస్తవానికి 2024లో బెంగళూరు రూరల్, అర్బన్ ప్రాంతాల్లో నీటి కోసం ప్రజలు 100 శాతం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని వెల్లడైంది. వాస్తవానికి నిబంధనల ప్రకారం 70 శాతం కంటే తక్కువ నీటిని భూమి నుంచి పొందటం సేఫ్. కానీ 100 శాతం ఈ మార్గం నుంచే పొందటం ఆందోళనకర స్థాయికి చిహ్నంగా పేర్కొనబడింది. 2022, 2023 సంవత్సరాల్లో కూడా బెంగళూరు ప్రజలు 100 శాతం భూగర్భజలాలనే వినియోగించటం నీటి ఎద్దడి సమస్యను హైలైట్ చేస్తోంది. ప్రభుత్వం కూడా ఈ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేసింది.
అయితే వాస్తవానికి బెంగళూరులో భూమిలో ఇంకుతున్న నీటి కంటే రెండితలు నీటిని ప్రజలు బోర్ల ద్వారా లాగేస్తున్నారని తేలింది. గడచిన 13 ఏళ్లుగా ఇవే పరిస్థితులు కొనసాగుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షపు నీటి కుంటలు తవ్వడం, భూగర్భ జలాల పెంపుదల గురించి అవగాహన కల్పించడం, శుద్ధి చేసిన నీటి వాడకాన్ని ప్రోత్సహించడం వంటి వాటిపై అన్ని పౌర సంస్థలకు సూచనలు కూడా చేయబడ్డాయి. కేసీ వ్యాలీ, హెచ్ఎన్ వ్యాలీ, వృషభవతి వ్యాలీల్లో ట్యాంక్ నింపే ప్రాజెక్టులు కూడా భూగర్భ జలాల పెంపుకు ప్రజలు ముందుకు రావాలని సూచిస్తున్నారు.
అనేక స్కూళ్లు, కాలేజీల్లో దీనికోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తుండగా ప్రజలు కూడా దీనిలో భాగంగా కావాలని వారు సూచిస్తున్నారు. బెంగళూరు నగరంలో దాదాపు 80 శాతం బోర్లు నీళ్లు పడక నిరాశను మిగులుస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం దీనిని ఆపటం లేదని ఎకాలజిస్ట్ ఎల్లప్ప రెడ్డి వెల్లడించారు. నగరంలోని HSR లేఔట్ లాంటి ప్రాంతాల్లో 1000 ఫీట్ల వరకు బోర్లు వేయాల్సి వస్తోందని ఆయన పేర్కొన్నారు. దొరుకుతున్న నీరు సైతం అనేక కారకాలతో వినియోగానికి అనుకూలంగా లేదని హైడ్రాలజిస్ట్ దేవరాజు రెడ్డి వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కువగా వాటర్ ట్యాంకుల సరఫరాపైనే ఆధారపడటాన్ని పెంచుతోంది.
ఎండాకాలం వస్తే నగరంలోని అనేక ప్రాంతాల్లో కనీస అవసరాలకు సైతం నీరు లేకపోవటంతో వాటర్ ట్యాంకులకు ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. కోట్లు వెచ్చించి సొంత ఇల్లు కొనుక్కున్నా దానిలో తాగటానికి గుక్కెడు నీళ్లు కూడా లభించని పరిస్థితులు ఉండటంతో చాలా మంది రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ ఉద్యోగులు సొంతిల్లు కొనటంపై డైలమాలో ఉన్నారు. వస్తున్న సంపాదన ఈఎంఐలకు, నీటి బిల్లుకు సరిపోయేలా ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్‌ఫ్రమ్ హోం సౌకర్యాన్ని దాదాపుగా నిలిపివేసిన నేపథ్యంలో రానున్న వేసవికి ముందు పరిస్థితల దృష్యా చాలా మంది తమ రియల్టీ పెట్టుబడి ఆలోచనలను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications