తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ని చిక్కడ్ పల్లి పోలీసులు అరెస్ట్ చేసారు. కొద్దీరోజుల క్రితం పుష్ప-2 సినిమా రిలీజైన సంగతి తెలిసిందే అయితే రిలీజ్ ముందు బెనిఫిట్ షో సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. పుష్ప-2 రిలీజ్ ముందు రోజు రాత్రి ఫ్యాన్స్ కోసం హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్లో ప్రీమియర్ షో వేశారు. ఈ ప్రీమియర్ షో సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు ప్రాణాలు పోగోట్టుకున్నారు.
ఈ ఘటనకి సంబంధించి పోలీసుల వివరాల ప్రకారం ప్రీమియర్ షోకి ఫ్యాన్స్ అత్యధికంగా రావడం అందులో మహిళలు, చిన్న పిల్లలు, ఫ్యామిలీస్ కూడా ఉండటం గమనార్హం. అయితే ప్రీమియర్ షోకి కట్టుదిట్టమైన సిబ్బంది ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ సమయంలో సమాచారం లేకుండా అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో ప్రీమియర్ షోకి రావడంతో అభిమానులు అతడిని చూసేందుకు ఎగబడంతో తొక్కిసలాట జరిగింది. దింతో అక్కడ ఒక ఉన్న ఒక మహిళా ఆమె కుమారుడు అక్కడిక్కడే మృతి చెందారు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు నేడు అరెస్ట్ చేసారు.

సినీ దర్శకుడు సుకుమార్ యాక్షన్ సీక్వెల్ పుష్ప 2: ది రూల్ ఒక వారంనే బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలిజైన ఈ సినిమా కలెక్షన్ల్స్ వర్షం కురోపించింది. అంతేకాదు ప్రభాస్ కల్కి 2898 AD, షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా కలెక్షన్లను ఇప్పటికే అధిగమించిన పుష్ప 2 ఇప్పుడు యష్ నటించిన KGF: చాప్టర్ 2, SS రాజమౌళి RRR రికార్డును బీట్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా నెట్ ఇండియా కలెక్షన్స్ ఇప్పుడు రూ. వెయ్యి కోట్లు దాటింది. ఇంకా రోజురోజుకూ కెలెక్షన్స్ కొనసాగుతున్నాయి. పుష్ప 2 సినిమా మొదటి వారానికి హిందీలో 27 కోట్లు, తెలుగులో 8 కోట్లు వసూలు చేసింది. మిగిలిన కలెక్షన్ మలయాళం, కన్నడ ఇంకా తమిళ వెర్షన్‌ల ద్వారా వచ్చాయి.
ఈ సినిమా హిందీ వెర్షన్‌కు సంబంధించి ఇండియాలో మొత్తం కలెక్షన్లు ఒక్క వారంలోనే రూ.400 కోట్ల మార్కును దాటాయి. మైత్రీ మూవీ మేకర్స్ ప్రకారం, పుష్ప 2 ఏడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1067 కోట్లు వసూలు చేసింది, అంటే ఎనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1105 కోట్లు వసూలు చేసింది. ఎనిమిదో రోజు అంతర్జాతీయ గణాంకాలను చూస్తే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications