దేశంలోని పలు నగరాల విమానాశ్రయాలలో గత మూడు రోజులుగా ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన భారీ అంతరాయాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముందస్తు సమాచారం లేకుండా, తగిన మార్గదర్శకాలు ఇవ్వకుండా వందలాది మంది గంటల తరబడి టెర్మినళ్లలో నిలిచిపోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలించింది. చివరి నిమిషంలో విమానాలు రద్దు కావడంతో చాలామంది తమ కుటుంబ, వ్యాపార, వైద్య అత్యవసర ప్రయాణాలను కోల్పోయారు.
పైలట్లకు కొత్తగా అమలు చేసిన విమాన విధి, విశ్రాంతి సమయ నిబంధనలు (FDTL) కారణంగా తగిన సిబ్బంది అందుబాటులో లేకపోవడం ఈ విస్తృత అంతరాయాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఒక్కరోజే 500కిపైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. ప్రయాణికులు టికెట్లు లేదా గేట్‌లు మారుస్తూ సమాచారం కోసం పరుగులు పెట్టినా, హెల్ప్ డెస్క్‌లు నిశ్శబ్దంగా ఉండిపోయాయి. బోర్డింగ్ డిస్ప్లే బోర్డులపై విమానాలు సమయానికి ఉన్నట్లు చూపించటం పరిస్థితిని మరింత గందరగోళంగా మార్చింది.

సామాజిక మాధ్యమాలపై ప్రయాణికులు తమ బాధలను వెల్లగక్కారు. X యూజర్ ఆయుష్ కుచ్యా తాజాగా చేసిన పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. అందులో అలసిపోయి, ఆందోళనతో నిలబడిన ప్రయాణికులు ఎలాంటి అప్‌డేట్ లేక గంటల తరబడి ఎదురుచూస్తూ కనిపిస్తారు. వీడియోలో ఒక వ్యక్తి రోదిస్తూ.. దయచేసి ఎవరైనా నా బాస్‌కి ఫోన్ చేసి నన్ను ఉద్యోగం నుంచి తీసివేయొద్దని చెప్పండి... నేను ఇదంతా భరించలేకపోతున్నాను అని వేడుకోవడం ప్రజలను కదిలించింది. ఆలస్యం వల్ల అతను ఉద్యోగం కోల్పోతాడన్న భయం అతని పరిస్థితిని మరింత దారుణంగా చేసింది.
మరో ప్రయాణికుడు కెప్టెన్ రాలేదు కాబట్టి విమానం వెళ్లదని సిబ్బంది చెప్పారని.. వృద్ధ ప్రయాణికుడు ఇకపై నేను ఈ ఎయిర్‌లైన్‌ను నమ్మను అని తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మరో వీడియోలో ప్రయాణికులు గందరగోళంతో రద్దీగా ఉన్న టెర్మినల్‌లో తిరుగుతున్న దృశ్యాలు కనిపించాయి. అక్కడున్న ఒక ప్రయాణికుడు దీనిని ఇండిగో నిర్వహణ లోపం అని పేర్కొంటూ, సరైన కమ్యూనికేషన్ ఉంటే ఈ స్థాయి సంక్షోభం ఎప్పుడూ రాకపోయేదని అన్నారు.
పూణే ప్రయాణికుడు డాక్టర్ ప్రశాంత్ పన్సారే మాట్లాడుతూ గేట్ వద్ద ఎవరూ కనిపించలేదు, ఎలాంటి సమాచారం లేదు, మేమే పరిస్థితిని అర్థం చేసుకోవాల్సివచ్చిందని వ్యాఖ్యానించారు. బుధవారం మాత్రమే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాలలో 100కి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయి. గత కొద్ది వారాలుగా ఎయిర్‌లైన్ ఎదుర్కొంటున్న కార్యకలాప సమస్యలు గురువారం పూర్తిగా నియంత్రణ తప్పాయి.
ఈ ఘటనలు విస్తృత స్థాయిలో వ్యతిరేకత రాగానే, ఇండిగో గురువారం సాయంత్రం Xపై క్షమాపణలు తెలిపింది. వారి ప్రకటనలో గత రెండు రోజులుగా ఇండిగో నెట్‌వర్క్‌లో విస్తృత అంతరాయాలు చోటు చేసుకున్నాయి. మా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు అని పేర్కొన్నారు. అలాగే కార్యకలాపాలను పునరుద్ధరించడానికి విమానయాన అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపారు.
అయితే ప్రయాణికులు ఈ క్షమాపణలను అంగీకరించలేకపోతున్నారు. వారికి సమయానికి సమాచారం అందకపోవడం, రాత్రంతా విమానాశ్రయాలలో వేచి ఉండడం, వైద్య అత్యవసరాలు, ఉద్యోగ సంబంధిత కారణాలతో ప్రయాణించాల్సిన వారికి పెద్ద నష్టం కలిగింది. ఈ సంక్షోభం భారతీయ విమానయాన రంగం పారదర్శకత, ప్రయాణికుల హక్కులపై మరొకసారి పెద్ద ప్రశ్నను విసిరింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications