జనవరి 2021లో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డౌన్ లోడ్ చేసుకున్న నాన్-గేమింగ్ యాప్‌లలో టెలిగ్రామ్ ముందు స్థానంలో నిలిచింది. ఈ డౌన్ లోడ్‌లలో 24 శాతం భారత్ నుండి ఉన్నాయి. ఈ మేరకు సెన్సార్ టవర్ డేటా తాజా డేటాను విడుదల చేసింది. ఈ మెసేజింగ్ యాప్‌ను 63 మిలియన్ల మంది గత నెలలో డౌన్ లోడ్ చేసుకున్నారు. భారత్‌లో 15 మిలియన్ల కొత్త యూజర్లు టెలిగ్రాంకు వచ్చారు. ప్రధానంగా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నేపథ్యంలో యూజర్లు ప్రపంచవ్యాప్తంగా టెలిగ్రాం వైపు మరలుతున్నారు.

టాప్ యాప్స్
వాట్సాప్ కొత్త పాలసీ నేపథ్యంలో చాలామంది యూజర్లు టెలిగ్రాంను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా డౌన్‌లోడ్స్‌లో టెలిగ్రాం తర్వాత టిక్‌టాక్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత సిగ్నల్, ఫేస్‌బుక్ మూడు, నాలుగు స్థానాల్లో ఉంది. వాట్సాప్ ఐదో స్థానానికి పడిపోయింది. అంతకుముంది ఇది మూడో స్థానంలో ఉండింది. సెన్సార్ టవర్ 'టాప్ యాప్స్ వరల్డ్ వైడ్ ఫర్ జనవరి 2021 బై డౌన్‌లోడ్స్' నివేదిక ప్రకారం టెలిగ్రాం, టిక్‌టాక్, సిగ్నల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా డౌన్ లోడ్ అయిన యాప్స్‌లో ఉన్నాయి.

ఇండియాలో 24 శాతం
టెలిగ్రాం డౌన్ లోడ్స్‌లో భారత్ 24 శాతంతో ముందు నిలిచింది. ఇండోనేషియాలో 10 శాతం డౌన్ లోడ్స్ ఉండగా, రెండో స్థానంలో ఉంది. ఇక టిక్ టాక్ డౌన్ లోడ్స్ చైనాలో 62 మిలియన్లు ఉన్నాయి. మొత్తం డౌన్ లోడ్స్‌లో ఈ వాటా 17 శాతం. ఆ తర్వాత అమెరికాలో 10 శాతం ఉంది. చైనా-భారత్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్ దేశానికి చెందిన టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేశారు. దీంతో టిక్ టాక్ యాప్ ఇక్కడ లేదు.

దూసుకొచ్చిన సిగ్నల్
డిసెంబర్ 2020లో అత్యధికంగా డౌన్ లోడ్ అయిన యాప్స్‌లో టిక్ టాక్ మొదటి స్థానంలో ఉంది. టెలిగ్రాం అయితే టాప్ 5లో కూడా లేదు. కానీ వాట్సాప్ ప్రైవసీ పాలసీ దెబ్బతో జనవరిలో ఏకంగా సిగ్నల్ మూడో స్థానంలోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ ఆరో స్థానంలో నిలిచింది. జూమ్, ఎంఎక్స్ టాకా టక్, స్నాప్‌చాట్, మెసెంజర్ ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి.యాప్ స్టోర్, గూగుల్ స్టోర్ డేటా నుండి వీటిని సేకరించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications