న్యూఢిల్లీ: అంతకుముందు ఆర్టికల్ 370, ఇటీవల CAA కారణంగా విపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ దేశాల్లో మైనార్టీలు ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో నెహ్రూ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ ఏడు దశాబ్దాలుగా డిమాండ్ చేసిన ఆయా దేశాల మైనార్టీలకు పౌరసత్వం కల్పించే చట్టం CAAను తెచ్చామని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే దీనిపై విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. CAAను వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేయడం వరకు ఓకే. కానీ కొంతమంది సంఘ విద్రోహ శక్తులు వాహనాలు, భవనాలను ధ్వంసం చేశారు. విధ్వంసం సృష్టించారు. దీంతో ప్రభుత్వం పలుచోట్ల ఇంటర్నెట్‌ను నిలిపివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో ఆర్టికల్ 370 విషయంలోను ఇదే జరిగింది. నిరసనకారుల ఆందోళనలు హింసకు దారి తీస్తుండటం, దీంతో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తుండటంతో టెలికం సంస్థలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది.

ప్రతి గంటకు 24.5 మిలియన్ల ఆదాయం కోల్పోతున్నారు
ఇంటర్నెట్ బంద్‌వల్ల మొబైల్ ఆపరేటర్లు ప్రతి గంటకు రూ.24.5 మిలియన్ల ఆదాయాన్ని కోల్పోతున్నారు. సంఘ విద్రోహశక్తులు రెచ్చిపోతుండటంతో శుక్రవారం ఉత్తర ప్రదేశ్‌లోని 18 జిల్లాలు సహా వివిధ చోట్ల ఇంటర్నెట్ బంద్ చేశారు. ఈ నేపథ్యంలో ఆపరేటర్లు పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. అల్లర్లు, ఆందోళనల సమయంలో ఎలాంటి వదంతులు వ్యాప్తి చెందకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపి వేస్తారు.

నిన్న ఆర్టికల్ 370, నేడు CAA
గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ము కాశ్మీర్‌లో, ఇప్పుడు CAA నేపథ్యంలో యూపీ, ఢిల్లీ, అసోం వంటి రాష్ట్రాల్లో మొబైల్ సేవలు నిలిపి వేశారు. ఢిల్లీలో కొన్ని గంటల పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలు పాక్షికంగా నిలిపివేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తాము పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోతున్నామని టెలికం ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

గంటకు రూ.2.45 కోట్లు
2019 లెక్కల ప్రకారం ఇంటర్నెట్ నిలిపివేత కారణంగా టెలికం ఇండస్ట్రీ ప్రతి గంటకు రూ.2.45 కోట్ల చొప్పున ఆదాయం కోల్పోతోందని సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ అన్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ఇది మరింత నష్టం కలిగిస్తోందన్నారు. నష్టాలపై వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్, జియో స్పందించాల్సి ఉంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications