New sim rules: దేశ భద్రతకు విఘాతం కలిగించే అవకాశమున్న మార్గాలపై కేంద్రం దృష్టిసారించింది. సిమ్ కార్డుల విక్రయానికి సంబంధించి ఇప్పటికే పలు నిబంధనలు అమల్లో ఉన్నా, కొన్ని సంస్థలు కొంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. కానీ ఇక అలా చేయడం కుదరదు. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి కొత్త నియమాలు పాటించాల్సిందేనని టెలికాం నియంత్రణ సంస్థ ఆదేశించింది.
దేశంలో సిమ్ కార్డుల కొనుగోలు, విక్రయాలు, యాక్టివేషన్ పై డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం(DoT) కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మేరకు రెండు సర్క్యులర్లను జారీ చేసింది. వాటిలో ఒకటి సిమ్ యూజర్లకు కాగా మరొకటి ఎయిర్ టెల్, జియో వంటి సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలకు సంబంధించినది. పాడైన సిమ్ కార్డు రిప్లేస్ మెంట్ సమయంంలోనూ యూజర్లు మరోసారి ధ్రువీకరణ పూర్తి చేయాల్సిందేనని పేర్కొంది.

భద్రతను పెంపొందించడం కోసం తాజా నియమాలను ప్రవేశపెట్టినట్లు DoT వెల్లడించింది. కఠినమైన KYC నిబంధనలు తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపింది. తమ సిమ్ కార్డులు విక్రయించే షాపులను సర్వీస్ ప్రొవైడర్లు పూర్తిగా KYC చేయాలని ఆదేశించింది. లేని పక్షంలో ఒక్కో దుకాణదారునికి 10 లక్షల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఎయిర్‌టెల్, జియో వంటి కంపెనీలు తమ సిమ్ కార్డ్‌లను ఎవరు, ఏ పద్ధతిలో విక్రయిస్తున్నారనే వ్యవహారాన్ని చాలా నిశితంగా పరిశీలించాల్సి ఉంటుందని DoT సూచించింది. అదనంగా అస్సాం, కాశ్మీర్ మరియు ఈశాన్య ప్రాంతాల్లో టెలికాం ఆపరేటర్లు అధికారిక ఒప్పందం కుదుర్చుకునే ముందు షాపులకు పోలీసు ధృవీకరణను ప్రారంభించాలని కోరింది.
స్పామ్ మెసేజింగ్, సైబర్ మోసాల నివారణకు సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని ఆపడమే తమ లక్ష్యమని DoT స్పష్టం చేసింది. ఇందుకోసం సిమ్స్ బల్క్ సేల్ ను నిషేధిస్తున్నట్లు చెప్పింది. అక్టోబర్ 1, 2023 నుంచి ఈ కొత్త నిబంధనలు అమలుచేయాల్సిందేనని తేల్చి చెప్పింది.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications