VI Stock: చాలాకాలంగా దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద పోటీ కొనసాగుతోంది. ఈ క్రమంలో జియో ధాటికి ప్రముఖ టెలికాం కంపెనీలైన వొడఫోన్, ఐడియాలు ఒక్కటి కావాల్సి వచ్చింది. ఆదిత్యా బిర్లా గ్రూప్ టెలికాం సంస్థ పెద్ద సంఖ్యలో యూజర్లను కలిగి ఉన్నప్పటికీ 4జీ, 5జీ విస్తరణలో కొంత వెనుకపడిన మాట నిజమే. అక్కడి నుంచే కంపెనీ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పతనాన్ని చూడటం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది వొడఫోన్ ఐడియా లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. ఒకప్పుడు దేశంలో వెలుగువెలిగిన ఈ సంస్థ ప్రస్తుతం టెలికాం రంగంలో నిలదొక్కుకునేందుకు పెద్దస్థాయిలో ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు సెప్టెంబర్ మాసంలో దాదాపు 33 శాతం క్షీణతను నమోదు చేశాయి. ఈ క్రమంలో అక్టోబర్ 2019 తర్వాత కంపెనీ షేర్లు భారీగా క్షీణతను చూడటం ఇదే తొలిసారి. దీంతో కేవలం సెప్టెంబరు నెలలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.34,000 కోట్లకు పైగా క్షీణతను చూటంతో ఇన్వెస్టర్లు భారీగా తమ సంపదను కోల్పోయారు. అయితే నెల చివరి రోజైన సెప్టెంబర్ 30న ఒక్కో షేరు రూ.10.36 వద్ద తన ప్రయాణాన్ని ముగించింది.

సెప్టెంబరు నెల ప్రారంభ సమయంలో విఐ స్టాక్ ధర ఒక్కోటి దాదాపు రూ.15.64 వద్ద ఉండగా నెల చివరి రోజు నాటికి అది దాదాపు 33 శాతం క్షీణతను చూడటంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో కంపెనీ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల స్థాయి నుంచి రూ.72 వేల కోట్లకు దిగజారింది. గత నెలలో టెలికాం దిగ్గజం ఏజీఆర్ బకాయిలను తిరిగి లెక్కించాలంటూ వేసిన పిటిషన్ సుప్రీం ధర్మాసనం తిరస్కరించిన తర్వాత స్టాక్ భారీ పతనాన్ని నమోదు చేసింది. అయితే ఈ తీర్పుతో వోడాఫోన్ ఐడియా నగదు ప్రవాహ సవాళ్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని బ్రోకరేజ్ సంస్థ ఐఐఎఫ్ఎల్ అభిప్రాయపడింది. అయితే కంపెనీ ఇటీవలి కాలంలో వేగంగా సేవల విస్తరణను కొనసాగించేందుకు రుణ సేకరణకు ప్రయత్నిస్తున్న సమయంలో కోర్టు నుంచి ప్రతికూల తీర్పు రావటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు.
వొడఫోన్ ఐడియా షేర్లు గత ఆరు నెలల కాలంలో 25%, 2024లో ప్రారంభం నుంచి ఇప్పటివరకు 38% క్షీణతను నమోదు చేశాయి. అలాగే ఏడాది ప్రాతిపదికన 13% క్షీణతను నమోదు చేసింది. దీర్ఘకాలంలో కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే.. ఐదేళ్లలో 105% వరకు వృద్ధిని సాధించింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లకు 52 వారాల గరిష్ఠ ధర రూ.19.15 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.9.79గా ఉంది. అలాగే కంపెనీ ఏజీఆర్ డ్యూస్ కింద గతంలో ప్రభుత్వానికి వాటాలను అందించిన సంగతి తెలిసిందే. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 23.15 శాతంగా ఉంది. ఇదే క్రమంలో విదేశీ పెట్టుబడిదారు GQG భాగస్వాములు 2.17 శాతం వాటాను కలిగి ఉన్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications