Q4 Results: జియోతో పోటీలో ఎయిర్‌టెల్ ఓడిందా.. క్యూ4 డివిడెండ్ ఎంతంటే..?
Airtel Q4 Results: దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ నేడు తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,072 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే నికర లాభం 31.1 శాతం క్షీణతను నమోదు చేసింది.
జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో కంపెనీ నికర ఆదాయం రూ.37,599 కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే టెలికాం దిగ్గజం ఆదాయం 4.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ కాలంలో ఆఫ్రికన్ కరెన్సీల విలువ తగ్గింపు ప్రభావం ముఖ్యంగా నైజీరియన్ నైరా ఆదాయాలపై ప్రభావం చూపినట్లు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. వాస్తవానికి మార్కెట్ వర్గాల అంచనాల కంటే కంపెనీ త్రైమాసిక ఫలితాలు తక్కువగా నమోదైంది. మార్కెట్ వర్గాలు నికర లాభం రూ.2,201 కోట్ల నుంచి రూ.5,309గా అంచనా వేశారు.

మార్చి త్రైమాసికంలో కంపెనీ భారత ఆదాయం ఏడాది ప్రాతిపదికన 12.9 శాతం పెరిగి రూ.28,513 కోట్లుగా నమోదైంది. ఈ కాలంలో కంపెనీ బలమైన 4G/5G కస్టమర్ జాయినింగ్స్ ఆదాయ వృద్ధి నమోదైంది. ఇదే క్రమంలో ఏకీకృత మొబైల్ డేటా ట్రాఫిక్ 26.2% ఆరోగ్యకరమైన వృద్ధితో ఏడాది ప్రాతిపదికన త్రైమాసికంలో 17,702 బేసిస్ పాయింట్ల వద్ద ఉంది.
సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో కంపెనీ యజమానులకు రూ.3,005 కోట్ల ఏకీకృత పన్ను తర్వాత లాభాన్ని నమోదు చేసింది. నేడు మార్కెట్ల ముగింపు సమయంలో ఎయిర్‌టెల్ షేర్లు దాదాపు రూ.1,287 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. కంపెనీ త్రైమాసికంలో టవర్ల సంఖ్యను భారీగా పెంచింది.
టెలికాం దిగ్గజం 7.8 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ కస్టమర్‌లను పొందింది. అలాగే కంపెనీ ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఏడాది కిందట మార్చి త్రైమాసికంలో రూ.193 ఉండగా అది ప్రస్తుతం రూ.209కి పెరిగి ఇండస్ట్రీలో అగ్రగామి ఆదాయాన్ని నమోదు చేసింది. దీంతో కంపెనీ నేడు ఫలితాల ప్రకటనలో ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.8 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.
ఈ త్రైమాసికంలో టెల్కో భారతదేశ సబ్‌స్క్రైబర్ బేస్ 2.4% పెరిగి 406 మిలియన్లకు చేరుకుంది. నైజీరియన్ నైరా విలువ తగ్గటం ఏకీకృత పనితీరు ప్రధానంగా ప్రభావితమైందని కంపెనీ ఎండీ గోపాల్ విట్టల్ చెప్పారు. కంపెనీ గత సంవత్సరం కంటే 28.6 మిలియన్ల 4G/5G డేటా కస్టమర్‌లను తన నెట్‌వర్క్‌కు జోడించి 12.8% వృద్ధిని నమోదు చేసింది. మెుత్తానికి ఎయిర్ టెల్ ఏడాదికి 14.1% ఆదాయ వృద్ధిని అందించింది. అలాగే డిజిటల్ టీవీ వ్యాపారం త్రైమాసికంలో 6% వృద్ధి చెందింది.


Click it and Unblock the Notifications