Bharti Hexacom IPO: దేశంలో స్టాక్ మార్కెట్ల గందరగోళంలో సంబందం లేకుండా ఐపీవోల రాక కొనసాగుతూనే ఉంది. సెబీ సైతం గడచిన రెండేళ్లుగా చిన్న, పెద్ద ఐపీవోలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మార్కెట్ల ర్యాలీకి పరోక్షంగా సహాయపడుతోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మార్కెట్లోకి త్వరలో రాబోతున్న భారతీ హెక్సాకామ్ కంపెనీ ఐపీవో గురించే. ఈ కంపెనీ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ యూనిట్. ఐపీవో ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నుంచి తాజాగా అనుమతి పొందటంతో పెట్టుబడిదారుల్లో కోలాహలం నెలకొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఐపీవోలో కొత్త ఈక్విటీ షేర్ల ఇష్యూ ఉండదు.. ఇది పూర్తిగా అఫర్ ఫర్ సేల్ రూపంలో కొనసాగనుంది.

ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ కింద 10 కోట్ల షేర్లను టెలికాం కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ విక్రయించనుంది. భారతి హెక్సాకామ్ జనవరిలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI)కి ఐపీవో కోసం పత్రాలను దాఖలు చేసింది. కంపెనీకి మార్చి 11న ఫైండింగ్స్ లెటర్ అందింది.
భారతి హెక్సాకామ్ రాజస్థాన్, నార్త్ ఈస్ట్‌లోని వినియోగదారులకు ఎయిర్‌టెల్ బ్రాండ్ క్రింద వినియోగదారు మొబైల్ సేవలు, ఫిక్స్‌డ్ లైన్ టెలిఫోన్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.549.2 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 67.2 శాతం తక్కువ. ఐపీవోకి ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్, యాక్సిస్ క్యాపిటల్, BOB క్యాపిటల్ మార్కెట్స్, ICICI సెక్యూరిటీస్, IIFL సెక్యూరిటీస్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.


Click it and Unblock the Notifications