Tata Play: దేశంలో అతిపెద్ద డీటీహెచ్ ఆపరేటర్లలో టాటా ప్లే కూడా ఒకటి. అయితే చాలా కాలంగా ఈ వ్యాపారం నష్టాల్లోనే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే టాటాలకు చెందిన ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు టెలికాం దిగ్గజం ఆసక్తి కనబరుస్తోందని వెల్లడైంది. దీనికి ముందు 2017లో సైతం టాటా గ్రూప్ నుంచి ఎయిర్ టెల్ కస్టమర్ మెుబిలిటీ వ్యాపారాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది టాటాలకు చెందిన డీటీహెచ్ వ్యాపారాన్ని ఎయిర్ టెల్ కొనుగోలు చేయాలని చూస్తోంది. అయితే దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే ప్రారంభించబడినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్లో అందరి చూపు ఈ డీల్ పైనే కొనసాగుతోంది. అసలు టెలికాం కంపెనీ ఎందుకు నష్టాల్లో ఉన్న సంస్థను కొనుగోలు చేయాలని చూస్తుందనే అనుమానం అందరిలోనూ ఉంది. దీనికి కారణాలను పరిశీలిస్తే.. ప్రధానంగా టైర్ 1, టైర్ 2 నగరాల్లోని వినియోగదారులు హోమ్ బ్రాడ్‌బ్యాండ్‌లో DTH నుంచి OTT ప్యాక్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్నారు. అలాగే తక్కువ ఖర్చుతో ఎంటర్టైన్మెంట్ కోసం ఆన్‌లైన్ ఎంపికలకు మారుతున్నారు. ఇదే క్రమంలో గ్రామీణ ప్రజలు సైతం ధోరణిలో సైతం మార్పులు వస్తున్న వేళ తాజా పరిస్థితులు ఉద్భవించాయని తెలుస్తోంది.

ఈ క్రమంలో టాటా ప్లే భవిష్యత్తు వృద్ధిపై ఎయిర్‌టెల్ బెట్టింగ్ వేస్తూ వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. ఇది తన వినియోగదారుల ఆఫర్ పోర్ట్‌ఫోలియోకి బాగా సరిపోతుందని ఎయిర్‌టెల్ భావిస్తోంది. అలాగే ఈ కొనుగోలు తమకు కొత్త కస్టమర్ బేస్ ను అందిస్తుందని టెలికాం దిగ్గజం భావిస్తోంది. పైగా ఇప్పటికే టాటా ప్లే వద్ద ఉన్న ప్రీమియం కస్టమర్లను చేరుకోవటానికి ఇది దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది. తద్వారా మార్కెట్లో రిలయన్స్ జియోకు గట్టిపోటీ ఇచ్చేందుకు సామర్థ్యాలను సముపార్జించాలని ప్లాన్ చేస్తోంది. భారతి ఎయిర్‌టెల్ టాటా ప్లేని కొనుగోలు చేయడం వల్ల భారత డీటీహెచ్ వ్యాపారంలో పెనుమార్పులకు దారితీయటంతో పాటుగా వినియోగదారులకు బండిల్డ్ సర్వీసెస్ అందించటానికి వీలు కల్పించనుంది.
అయితే ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై టాటా గ్రూప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం టాటా ప్లే కంపెనీలో టాటా సన్స్ 70 శాతం మెజారిటీ వాటాలను కలిగి ఉంది. దీనికి ముందు టాటా సన్స్ సింగపూర్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ టెమాసెక్ హోల్డింగ్స్ పీటీఈ నుంచి 10 శాతం వాటాను రూ.835 కోట్లు చెల్లించి దక్కించుకుంది. దీంతో కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్ల మార్కును అందుకుంది. ఇదే క్రమంలో కంపెనీలో అమెరికాకు చెందిన వాల్ట్ డిస్నీకి 30 శాతం వాటాలు ఉండగా ప్రస్తుతం ఈ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీవీ డిస్ట్రిబ్యూషన్ వ్యాపారాన్ని ఇండియాలో రిలయన్స్ జియోతో మెర్జ్ చేసిన వేళ ఈ ఉపసంగరణ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications