5G Services: ముఖేష్ అంబానీ రాకతో దేశంలోని టెలికాం రంగంలో భారీగా మార్పులు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలోని ప్రజలు 4జీ సేవలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వినియోగదారులను 5జీకి అప్ గ్రేడ్ చేయటం టెలికాం ఆపరేటర్లకు పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి.
దేశంలో ఇప్పటికీ అసంపూర్తిగా 5జీ నెట్‌వర్క్ రోల్‌అవుట్, పరిమిత మానిటైజేషన్ అవకాశాలతో టెలికాం సంస్థలు భారీగా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటి వరకు 5జీ కోసం చేసిన పెట్టుబడులపై రాబడిని చూడడానికి కష్టపడుతున్నాయి. చాలా మంది వినియోగదారుల మెుబైల్స్ ఇప్పటికీ 4జీ కంపెటబిలిటీ కలిగి ఉండటంతో పాటు ఇతర కారణాలు సైతం ప్రస్తుతం కంపెనీలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు.

దేశంలో అత్యంత వేగవంతమైన 5జీ సేవలను ఎయిర్ టెల్, జియో వంటి కంపెనీలు ఇప్పటికే ప్రారంభించినప్పటికీ అనుకున్న స్థాయిలో కస్టమర్లను సాధించలేకపోయాయి. 165 మిలియన్ల 5G కస్టమర్‌లను పంచుకునే రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు ప్రారంభించిన 18 నెలల తర్వాత వారి 5G సేవలను సమర్థవంతంగా మోనటైజ్ చేయలేకపోయాయని చెప్పుకోవాలి. 5Gని మానిటైజ్ చేయడంలో ఎదురయ్యే సవాళ్లు కస్టమర్‌ల కోసం బలవంతపు వినియోగ కేసులు, అప్లికేషన్‌లు లేకపోవడం, అలాగే వాయిస్ సేవల కోసం 4Gపై ఆధారపడటం వంటి సమస్యలు టెలికాం కంపెనీలను వెంటాడుతూనే ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలు 4జీ, 5జీ సేవల నాణ్యతలో వ్యత్యాసాన్ని గమనించినప్పుడే ప్రీమియం సేవలను పొందేందుతు ఆసక్తి చూపుతారని టెలికాం రంగంలోని నిపుణులు భావిస్తున్నారు. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు తమ ఖర్చుల భర్తీ కోసం వినియోగదారు చార్జీలను 15-20 శాతం మేర పెంచుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలైన దక్షిణ కొరియా, సింగపూర్, జపాన్ లలో సైతం యూజర్ల నుంచి వస్తున్న సగటు రెవెన్యూ పెరగలేదని.. ప్రపంచవ్యాప్తంగా సైతం 5జీ మానిటైజేషన్ నెమ్మదిగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో పక్క వినియోగదారులు మాత్రం టెలికాం కంపెనీలు తమను 5జీకి మార్చేందుకే 4జీ సేవల్లో వేగాన్ని, నాణ్యతను తగ్గిస్తున్నాయని ఆరోపించటం గమనార్హం. వీటిలో వాస్తవం ఎంతనే విషయం తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications