Jio Tariff Hikes: చాలా కాలంగా దేశీయ టెలికాం కంపెనీలు లోక్ సభ ఎన్నికల తర్వాత టారిఫ్ రేట్లను పెంచుతాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ప్రస్తుతం ఇది అక్షరాలా నిజం అని తేలిపోయింది.
ఎన్నికలు ముగిసిన తర్వాత తొలుత అంబానీకి చెందిన రిలయన్స్ జియో మిగిలిన టెలికాం కంపెనీల కంటే ముందుగా రేట్ల పెంపుకు జెండా ఊపింది. ఈ క్రమంలో పెరిగిన కొత్త టారిఫ్ ప్లాన్స్ జూలై 3, 2024 నుంచి అమలులోకి వస్తాయని తెలుస్తోంది. ఇదే క్రమంలో కంపెనీ తన కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్లను ప్రకటించింది. రేట్ల పెంపు నెలవారీ ప్లాన్ల నుంచి ఏడాది ప్లాన్ల వరకు అన్ని విభాగాల్లోనూ కంపెనీ తీసుకొచ్చిందని వెల్లడైంది.

ఒకసారి తాజాగా కంపెనీ ప్రకటించిన ప్లాన్లను గమనిస్తే.. ప్రీపెయిడ్ ప్లాన్స్ వివరాల ప్రకారం 155 ప్లాన్ 189కి, 209 ప్లాన్ ధర 249కి, 239 ప్లాన్ 299కి, 299 ప్లాన్ 349, 349 ప్లాన్ ధర 399కి, 399 ప్లాన్ 449కి పెంచబడ్డాయి. ఇదే క్రమంలో ఇతర ప్లాన్లను పరిశీలిస్తే.. 479 ప్లాన్ 579కి, 533 ప్లాన్ 629కి, 395 ప్లాన్ 479, 666 ప్లాన్ 799కి, 719 ప్లాన్ 859కి, 999 ప్లాన్ 1199కి, 1559 ప్లాన్ 1899కి, 2999 ప్లాన్ 3599కి పెంచబడ్డాయి. ఇదే క్రమంలో డేటా యాడాన్ ప్యాక్స్ ధరలను పరిశీలిస్తే 15 ప్లాన్ 19కి, 25 ప్లాన్ 29కి, 61 రూపాయల ప్లాన్ 69కి పెంచబడ్డాయి. ఇదే క్రమంలో పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ధరలను పరిశీలిస్తే.. 299 ప్లాన్ ధర రూ.349కి పెంచబడగా.. 399 ప్లాన్ రేటు ప్రస్తుతం 449కి పెంచినట్లు కంపెనీ వెల్లడించింది.
జియో కొత్త అప్లికేషన్స్ లాంచ్..
JioSafe: కాలింగ్, మెసేజింగ్, ఫైల్ బదిలీల కోసం క్వాంటం-సెక్యూర్ కమ్యూనికేషన్ యాప్ నెలవారీ ధరను రూ.199గా నిర్ణయించింది.
JioTranslate: వాయిస్ కాల్స్, మెసెజెస్, చిత్రాలను అనువదించడానికి AI-ఆధారిత మల్టీ లింగువల్ కమ్యూనికేషన్ యాప్ సేవలను నెలకు రూ.99 రుసుముతో అందుబాటులోకి జియో తీసుకొచ్చింది.
రిలయన్స్ జియో రేట్లను పెంచుతూ ఒక అడుగు ముందుకు వేయటంతో మిగిలిన టెలికాం ఆపరేటర్లైన ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియాలు సైతం త్వరలోనే టారిఫ్ పెంపులను ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆదాయాల ఒత్తిడిలో కొనసాగుతున్న టెలికాం కంపెనీలకు టారిఫ్ పెంపులు నిజంగా పెద్ద ఊరటను అందిస్తాయి. ఈ నిర్ణయం టెలికాం కంపెనీ షేర్ హోల్డర్లకు సానుకూలమైన వార్తగా నిలవనుంది. కంపెనీ ఆదాయాలు పెరగటంతో లాభదాయకత సైతం పెరుగుతుందని వారు నమ్ముతారు. రేపు మార్కెట్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభపడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications