Reliance Jio: ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టే అంబానీ ఆఫ్‌ఫోర్ ప్లాన్.. జియో 5జీ దూకుడు..
Reliance Jio: దేశంలో ప్రస్తుతం 5జీ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల కోసం డిమాండ్ పెంచేందుకు టెలికాం కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో అంబానీ జియో మెుదటి స్థానంలో ఉండగా.. ఎయిర్ టెల్ సైతం వేగంగానే 5G విస్తరణను కొనసాగిస్తోంది.
దేశంలో అతిపెద్ద టెలికాం సంస్థగా ఆవిర్భవించిన రిలయన్స్ జియో FY24లో 2 బిలియన్ డాలర్ల అతిపెద్ద ఆఫ్‌ఫోర్ లోన్ తీసుకుంది. మన కరెన్సీ ప్రకారం ఈ మెగా లోన్ విలువ అక్షరాలా రూ.16,640 కోట్లు. ఇంత భారీ మెుత్తాన్ని కంపెనీ 5జీ విస్తరణ కోసం అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించనుంది. నోకియా నుంచి పరికరాల కొనుగోలుకు ఇది దోహదపడుతోంది.

ఈ రుణాన్ని సమకూర్చడంలో HSBC మధ్యవర్థిగా సహాయం చేసింది. ఈ భారీ రుణానికి ఫిన్నిష్ సంస్థ ఫిన్ వెరా ఇన్సూరెన్స్ అందించింది. తద్వారా రానున్న కాలంలో టెలికాం కంపెనీల లెండర్లకు రక్షణను కల్పించింది. ఇది కంపెనీకి గణనీయంగా ఖర్చులను తగ్గించటంలో దోహదపడుతుందని తెలుస్తోంది. ఈ భారీ రుణ ఏర్పాటు కోసం గడచిన కొన్ని నెలలుగా రిలయన్స్ గ్రూప్ చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే.
జియో ఆఫ్‌షోర్ లోన్‌లలో సుమారు 2 బిలియన్ డాలర్లను సేకరించిన దాదాపు ఒక నెల తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఆర్థిక సేవల సంస్థ, రుణదాత BNP పరిబాస్ లావాదేవీకి ప్రధాన నిర్వాహకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్‌షోర్ రుణం స్వీడిష్ నెట్‌వర్కింగ్, టెలికాం కంపెనీ ఎరిక్సన్ నుంచి 5G నెట్‌వర్క్ పరికరాల కొనుగోలుకు నిధులు సమకూర్చడంలో సహాయంగా నిలిచింది. మెుత్తానికి రిలయన్స్ 4 బిలియన్ డాలర్ల మెగా రుణంతో తన 5జీ సేవలను దేశంలోని ప్రతి పౌరుడికి అందించేందుకు పెద్ద ప్లాన్ చేస్తోంది. అయితే ఇతర టెలికాం ఆపరేటర్లు ఇంత భారీగా విస్తరణ కోసం ఖర్చుచేయటం లేదు. భవిష్యత్తులో జియో దూకుడుకు ఈ పెట్టుబడి కీలకంగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications