For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Airtel Xsafe: మీ ఇంటికి ఎయిర్‌టెల్ కాపలా..! 40 నగరాల్లో సేవలు ప్రారంభం.. రోజుకు రూ.3 కంటే తక్కువకే..

|

Airtel Xsafe: ఈ రోజుల్లో ఇంటి భద్రత చాలా కీలకంగా మారింది. ఈ క్రమంలో టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రస్తుతం హోమ్ సర్వైలెన్స్ సర్వీసులను ప్రారంభించింది. ఇళ్లలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలకు వెళ్లటం సర్వ సాధారణంగా మారింది. లేదా పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంటుంది. అలాంటి వారికి ఈ సేవలు బాగా ఉపయోగపడతాయి.

40 నగరాల్లో సేవలు..

40 నగరాల్లో సేవలు..

భారతీ ఎయిర్‌టెల్ గృహ నిఘా వ్యాపారంలోకి ప్రవేశించినట్లు కంపెనీ సోమవారం తెలిపింది. ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాతో సహా 40 నగరాల్లో సేవలను ప్రారంభించింది. కంపెనీ మొదటి కెమెరా కోసం ఏడాదికి రూ. 999, తర్వాత ఏర్పాటు చేసుకునే ప్రతి అదనపు కెమెరాకు ఏడాదికి రూ.699 ఛార్జ్ చేస్తుంది.

కరోనా తర్వాత..

కరోనా తర్వాత..

కరోనా తర్వాత చాలా మంది తమ ఇళ్లకు దూరంగా ఉండటం వల్ల అనేక మంది తమ ప్రియమైన వారు ఎలా ఉన్నారనే విషయాలపై అందోళన చెందుతున్నారు. దీనికి పరిష్కారంగా కోసం, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ సేవలను అందుబాటులోకి తెస్తోంది. Xsafe అనేది కస్టమర్‌లు తమ ప్రియమైన వారిపై ఓ కన్నేసి ఉంచేందుకు అనుమతించే ఎండ్-టు-ఎండ్ హోమ్ సర్వైలెన్స్ సొల్యూషన్. కెమెరాలోని టూ-వే కమ్యూనికేషన్ సిస్టమ్ ద్వారా ఇంట్లో ఉన్న వారితో ఎక్కడి నుంచైనా మాట్లాడేందుకు ఇది వీలు కల్పిస్తుందని భారతీ ఎయిర్‌టెల్ - హోమ్స్, సీఈవో వీర్ ఇందర్ నాథ్ తెలిపారు.

దీని ప్రత్యేకతలు..

దీని ప్రత్యేకతలు..

ఇది క్లౌడ్‌లో గరిష్ఠంగా 7-రోజుల వీడియోలను నిల్వ చేస్తుంది. దీని వలన వినియోగదారులు ఏదైనా రిమోట్ లొకేషన్ నుంచి రికార్డ్ చేయబడిన వీడియోను యాక్సెస్ చేయగలరు. కెమెరా ఏదైనా కదలికను గుర్తించినప్పుడు యాప్ రియల్ టైం హెచ్చరికలను అందిస్తుంది. నోటిఫికేషన్‌ల ద్వారా మీరు కోరుకున్నప్పుడల్లా వీక్షించడానికి ఇది ఫీడ్‌ను కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ వీడియోలను ఎయిర్‌టెల్ సురక్షిత క్లౌడ్ స్టోరేజ్‌ని ఉపయోగించి యాప్ ద్వారా ఎప్పుడైనా వినియోగదారులు పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. దీనికోసం ఇప్పటికే ఉన్న వైఫై కనెక్షన్‌ని వినియోగించుకోవచ్చు.

English summary

Airtel Xsafe: మీ ఇంటికి ఎయిర్‌టెల్ కాపలా..! 40 నగరాల్లో సేవలు ప్రారంభం.. రోజుకు రూ.3 కంటే తక్కువకే.. | telecom jaint airtel started home surveillance services across 40 cities in name of Airtel Xsafe

telecom jaint airtel started home surveillance services across 40 cities in name of Airtel Xsafe
Story first published: Tuesday, September 27, 2022, 17:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X