Airtel Airfiber: అంబానీకి ఎయిర్‌టెల్ గట్టి పోటీ.. 5జీ ఎక్స్‌ట్రీమ్ లాంట్.. ప్రత్యేకతలు
Airtel Airfiber: టెక్నాలజీతో నూతన టెలికాం సేవలను అత్యంత సమర్థవంతంగా అందించాలని జియో, ఎయిర్‌టెల్ ఇండియాలో పోటీపడుతున్నాయి. బ్రాడ్ బ్యాండ్ సేవలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
తాజాగా దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన ఫిక్స్‌డ్ వైర్‌లెస్ సర్వీస్ ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్(Airtel Xstream AirFiber) అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. ఇది వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరుస్తుందని కంపెనీ నొక్కి చెబుతోంది. ఇది గతంలోని సాంప్రదాయ వైర్డు కనెక్షన్‌ల అవసరాన్ని తొలగించింది.

ఎక్స్‌ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ అనేది అంతర్నిర్మిత Wi-Fi 6 సాంకేతికతను కలిగి ఉన్న ప్లగ్-అండ్-ప్లే పరికరం. ఇది విస్తృతమైన ఇండోర్ కవరేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఏకకాలంలో ఈ పరికరానికి 64 మంది కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునేందుకు వీలుగా దీనిని రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. దేశంలోనే ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఎయిర్‌ఫైబర్ మొదటి 5G వైర్‌లెస్ Wi-Fi సొల్యూషన్ అని టెలికాం ఆపరేటర్ పేర్కొంది.
ఎయిర్ టెల్ తీసుకొచ్చిన తాజా సాంకేతికత ద్వారా ఫైబర్-డార్క్ ప్రాంతాల్లోని ప్రజలకు సైతం ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది. ఫైబర్ నెట్‌వర్క్ అందుబాటులో లేని నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాండ్‌బ్యాండ్ కనెక్షన్ అందించేందుకు ఇదే తోడ్పడనుందని కంపెనీ తెలిపింది. భారతదేశంలోని చివరి-మైలు కనెక్టివిటీ సమస్యను పరిష్కరించడం దీని లక్ష్యమని టెలికాం దిగ్గజం చెబుతోంది. ప్రస్తుతం ఈ సేవలను మెుదటగా దిల్లీ, ముంబైలోని 5జీ వినియోగదారులకు అందుబాటులో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. రానున్న కాలంలో అన్ని టెలికాం సర్కిల్‌లకు ఈ సేవను క్రమంగా అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications