Airtel News: క్రికెట్ లవర్స్ కోసం సూపర్ ప్లాన్స్.. Jio, Vi, BSNL ఉక్కిరిబిక్కిరి..
Airtel News: దేశంలోనే కాకుండా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యువత ICC పురుషుల ప్రపంచ కప్- 2023 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హాట్ స్టార్ తన ఓటీటీలో ఉచితంగా ప్రసారాలను అందిస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నేపథ్యంలో కుర్రకారు నుంచి అన్ని వయస్సుల క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. దీంతో వరల్డ్ కప్ ఫీవర్ ప్రతి చోటా ప్రారంభమైంది. ఈ క్రమంలో మెుబైల్ యూజర్లు ఎక్కువ డేటా ప్లాన్స్ కోసం వెతుకుతున్నారు. దీనిని క్యాష్ చేసుకునేందుకు భారత టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఇంటర్నెట్ ప్యాక్స్ ప్రవేశపెట్టింది. జియోను ఢీకొట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ దీనితో చెప్పకనే చెప్పింది.

అందుకే రెండు అన్ లిమిటెడ్ డేటా ప్యాక్స్ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా అత్యంత తక్కువ రేటు రూ.49కి ఒకరోజు 6 జీబీ డేటా కోసం ప్లాన్ అందుబాటులోకి తీసుకురాగా.. ఆ తర్వాత రూ.99తో రెండు రోజుల వ్యాలిడిటీ కలిగిన అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ప్యాక్ ప్రకటించింది. ఈ ప్యాక్స్ క్రికెట్ స్ట్రీమింక్ అవసరాల కోసం ఉపయోగపడనుంది. దీనికి తోడు ఎయిర్ టెల్ డిటిహెచ్ స్టార్ నెట్‌వర్క్‌తో జతకట్టి కొత్త రీచార్జ్ ప్లాన్స్ అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా క్రికెట్ లవర్స్ స్టార్ స్పోర్ట్స్ ఛానళ్లను సులువుగా ఎంపిక చేసుకుని సబ్‌స్క్రైబ్ చేసుకునేందుకు వెసులుబాటును తీసుకొచ్చింది.
ఇటీవలి ఓపెన్‌సిగ్నల్ నివేదిక క్రికెట్ అభిమానులకు గో-టు ఛాయిస్‌గా ఎయిర్‌టెల్ స్థానాన్ని మరింత బలపరిచింది. ICC ప్రపంచ కప్ 2023 స్టేడియంలలో మెరుగైన నెట్‌వర్క్, వేగవంతమైన అప్‌లోడ్ వేగం నుంచి Airtel వినియోగదారులు ప్రయోజనం పొందుతారని నివేదిక వెల్లడించింది. ఓపెన్ సిగ్నల్ సంస్థ అన్ని స్టేడియంలలో మొబైల్ నెట్‌వర్క్ పనితీరును విస్తృతంగా అంచనా వేసింది. ముఖ్యంగా 5జీ నెట్‌వర్క్‌లో ఉందని నిర్ధారించింది. అంతేకాకుండా భారతదేశంలోని 40 అతిపెద్ద నగరాల్లో మొబైల్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ నాణ్యతలో ఎయిర్‌టెల్ టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.


Click it and Unblock the Notifications