Layoffs News: వందలాది మందికి టెలికాం దిగ్గజం లేఆఫ్స్.. 10 నిమిషాల వీడియో కాల్‌లో..
Layoffs in Telecom: గత రెండేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ కంపెనీలు మొదలు స్టార్టప్స్ వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించి షాక్ ఇస్తూనే ఉన్నాయి. అయితే ట్విట్టర్ టేకోవర్ సమయంలో ఎలాన్ మస్క్ వీడియో కాల్‌లోనే సిబ్బందికి ఉద్వాసన పలికినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి నిమిషాల వ్యవధిలో కాల్‌లోనే అకస్మాత్తుగా లేఆఫ్స్ ఇవ్వడం సాధారణమైపోయింది.
ఇటీవల 7 నిమిషాల కాల్‌లో ప్రముఖ టెక్ దిగ్గజం IBM ఉద్యోగులపై వేటు వేసింది. తాజాగా కెనడాకు చెందిన టెలీకమ్యూనికేషన్స్ దిగ్గజం బెల్ కూడా ఇదే పద్ధతిని అనుసరించింది. వర్చువల్ గ్రూప్ సమావేశాలలో 400 మందికి పైగా కార్మికులను తొలగించింది. దీంంతో ఆ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న యూనియన్ ఇది అవమానకర చర్య అంటూ కంపెనీ తీరును ఖండించింది.

పది నిమిషాల వీడియో కాల్‌లలో తొలగించబడిన ఉద్యోగులను 'మిగులు'గా ప్రకటించబడనట్లు సమాచారం. ఎవరినీ ప్రశ్నలు అడగడానికి అనుమతించకుండా మేనేజర్ లేఆఫ్ నోటీసును చదివినట్లు బాధితులు పేర్కొన్నారు. ఏళ్ల తరబడి కంపెనీకి తమ సభ్యులు చేసిన సేవకు రివార్డుగా పింక్ స్లిప్‌లు ఇచ్చి తొలగిస్తున్నారని యునిఫోర్ క్యూబెక్ డైరెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సంస్థ నిర్వహణ సులభతరంతో పాటు పరివర్తనను వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు బెల్ CEO మిర్కో బిబిక్ ఫిబ్రవరిలోనే స్పష్టం చేశారు. అవసరమైన మేర కోతలు విధించేందుకు 4 వేల 800 ఉద్యోగులను అంటే కంపెనీ శ్రామికశక్తిలో దాదాపు 9 శాతం మందికి ఉద్వాసన పలికేందుకు ముందుగానే ప్రణాళికలు ప్రకటించింది. అయితే అదే సమయంలో వాటాదారులకు డివిడెండ్ చెల్లింపును పెంచడంతో విమర్శలు వెల్లువెత్తాయి.


Click it and Unblock the Notifications