Jio Vs Airtel: దాదాపు దశాబ్ధకాలానికి పైగా భారతీయ టెలికాం రంగంలో అంబానీకి చెందిన రిలయన్స్ జియో మకుటం లేను మహారాజుగా తన ప్రయాణాన్ని కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జియో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇటీవలి త్రైమాసిక ఫలితాల్లో దాదాపు కోటి మంది కస్టమర్లను కోల్పోయినట్లు వెల్లడైంది. దీని ప్రభావం తమపై ఉండదని కంపెనీ చెబుతున్నప్పటికీ.. మరో పక్క ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, వొడఫోన్ ఐడియాలు భారీ నష్టాన్ని కలిగిస్తూ ముఖేష్ అంబానీని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
టెలికాం రంగంలో శత్రుత్వం ఎప్పటికీ అంతం కానిదని మనందరికీ తెలిసిందే. ఏదైనా టెలికాం సంస్థ ప్రత్యేకమైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టగానే.. దానికి పోటీగా మరో కంపెనీ మరింద ఆకర్షనీయమైన, మెరుగైన రీఛార్జ్ ప్లాన్‌తో ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే దేశంలోనే రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ తన 3.8 కోట్ల కస్టమర్ల కోసం ఆకర్షనీయమైన వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఏడాదికి రూ.2 వెల కంటే తక్కువ రేటులో సరికొత్త ప్లాన్ రివీల్ చేయబడింది. రూ.1999 ప్లాన్ కింద వినియోగదారులు 365 రోజుల కాలానికి అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఉచిత SMSలను పొందుతారని ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ ప్లాన్ ప్రధానంగా ఎక్కువగా ఫోన్ కాల్స్ మాట్లాడే వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.

అయితే ఎయిర్ టెల్ తెచ్చిన కొత్త రూ.1999 ప్లాన్ కస్టమర్లకు ఎక్కువగా ఇంటర్నెట్ ఉపయోగించటానికి డేటా లిమిట్ కలిగి లేదు. ఎందుకంటే ఈ ప్లాన్‌లో మొత్తం సంవత్సర కాలానికి 24GB డేటా మాత్రమే అందించబడుతోంది. అంటే యూజర్లు సగటున నెలకు కేవలం 2GB డేటా మాత్రమే అందుకుంటారు. వాస్తవానికి ఇది చిన్న మెుత్తం అనిపిస్తున్నప్పటికీ ఇంట్లో వైఫై కనెక్షన్, అలాగే పనిచేసే చోట ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉండే వ్యక్తులకు ఈ ప్లాన్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వీరికి మెుబైల్ డేటా కంటే బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ వినియోగం అధికంగా ఉంటుంది. బయటకు వెల్లినప్పుడు ఏదైనా యూపీఐ చెల్లింపులు లేదా ఇతర ప్రాథమిక బ్రౌజింగ్ వంటి తక్కువ డేటా పనులు ఉండే వ్యక్తులకు ఖచ్చితంగా ఈ ప్లాన్ డబ్బును సేవ్ చేస్తుందని చెప్పుకోవచ్చు.
ప్లాన్ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలతో పాటు వినియోగదారులు వినోదం కోసం ఎయిర్‌టెల్ స్ట్రీమ్‌కు ఉచిత యాక్సెస్, ఉచిత హలో ట్యూన్స్, ఆరోగ్య సంరక్షణ సేవల కోసం అపోలో 24/7 సర్కిల్ సభ్యత్వాన్ని కూడా పొందనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ప్రకటించటానికి ముందు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సైతం ఇదే తరహాలో ఒక ఇయర్లీ ప్లాన్ అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. జియో రూ.1899 ప్లాన్ మాత్రం కేవలం 336 రోజుల వ్యాలిడిటీని మాత్రమే అందిస్తోంది. కానీ ఎయిర్ టెల్ 365 రోజుల వ్యాలిడిటీని తీసుకొచ్చిన సంగతి యూజర్లు ఇక్కడ గమనించాలి. జియో 1899 ప్లాన్ కింద యూజర్లు ఏడాది మెుత్తానికి కలిపి 24 జీబీ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లను అందిస్తోంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications