SIM Card Rules: డిసెంబర్ 1 నుంచి మారిపోతున్న సిమ్ కార్డు రూల్స్.. జాగ్రత్త..
SIM Card Rules: మారిన ఆధునిక జీవితంలో మెుబైల్ ఫోన్ అంతర్గత భాగంగా మారిపోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో మనుషుల కంటే ఫోన్ల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పైగా ఎలాంటి ప్రభుత్వ పథకాలు పొందాలన్నా అందుకు మెుబైల్ నంబర్ తప్పనిసరిగా మారిపోయింది.
ఈ క్రమంలో డిసెంబర్ 1, 2023 నుంచి దేశంలో SIM కార్డ్ నియమాలు మారిపోతున్నాయి. మీరు కొత్త సిమ్ కార్డు కొనాలనుకుంటున్నట్లయితే ఈ మారిన నిబంధనలు తప్పక తెలుసుకోవాలి. దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నకిలీ సిమ్ మోసాలను అరికట్టేందుకు టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ వీటిని ప్రవేశపెడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న స్కామ్ కేసులను అరికట్టేందుకు ఇవి డిసెంబర్ నుంచి అమలులోకి వస్తున్నాయి.
ఈ నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానాలు, జైలు శిక్ష వంచి చర్యలను ప్రభుత్వం అమలులోకి తీసుకొస్తోంది. సిమ్ కార్డ్‌లను విక్రయించే డీలర్లు దీనికోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగే వీరి పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత సంబంధిత టెలికాం ఆపరేటర్ పైనే ఉంటుంది. దీనిని గనుక పాటించకపోతే రూ.10 లక్షల జరిమానా విధించబడుతుంది.
కస్టమర్లు తమ ప్రస్తుత నంబర్‌ల కోసం సిమ్ కార్డ్‌లను కొనుగోలు చేస్తే.. ఆధార్ స్కానింగ్, డెమోగ్రాఫిక్ డేటా సేకరణ తప్పనిసరి. కొత్త నిబంధనల ప్రకారం.. పెద్దమొత్తంలో సిమ్ కార్డ్‌ల జారీ వ్యాపార కనెక్షన్లపై మాత్రమే ఉంటుంది. ఇదే క్రమంలో ఒక వ్యక్తి గతంలో మాదిరిగా ఒక ఐడిపై 9 సిమ్ కార్డులను పొందేందుకు అనుమతి ఉంటుంది.

ఎవరిదైనా కార్డ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్లయితే ఆ నంబర్ 90 రోజుల వ్యవధి తర్వాత మాత్రమే మరొక వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. కొత్త నిబంధనలకు లోబడి ఉండటానికి సిమ్ అమ్మకం విక్రేతలు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి. వీటిని ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరిమానా, జైలు శిక్ష పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications