మొబైల్ నెంబర్‌కు కాల్ చేయాలంటే సున్నాను చేర్చండి, గుర్తు చేస్తున్న టెల్కోలు

ల్యాండ్ లైన్ నుండి మొబైల్స్ ఫోన్స్‌కు చేసే కాల్స్‌కు ముందు '0'ను ప్రెస్ చేయాలని టెలికం కంపెనీలు కస్టమర్లకు గుర్తు చేశాయి. ఈ మేరకు ల్యాండ్ లైన్ కస్టమర్లకు సందేశాలు పంపించాయి. గత ఏడాది నవంబర్ నెలలో టెలికం శాఖ తీసుకున్న నిర్ణయం మేరకు 2021 జనవరి 15వ తేదీ నుండి ఈ నూతన విధానం అమలులోకి వచ్చిందని కంపెనీలు తెలిపాయి.

ల్యాండ్ లైన్ నుండి ల్యాండ్ లైన్‌కు, మొబైల్ నుండి ల్యాండ్‌లైన్‌కు, మొబైల్ నుండి మొబైల్‌కు చేసే కాల్స్‌లో మార్పులేదు. ల్యాండ్‌ లైన్ నుండి మొబైల్ ఫోనుకు డయల్ చేసేటప్పుడు ఆ నెంబర్‌కు ముందు తప్పకుండా సున్నాను చేర్చడం జనవరి 15 నుండి అమలులోకి వచ్చినట్లు టెలికం సంస్థలు తెలిపాయి. భారతీ ఎయిర్‌టెల్ ఇప్పటికే సమాచారం ఇవ్వడాన్ని ప్రారంభించగా, జియో ఎస్సెమ్మెస్ పంపిస్తోంది.

Telcos remind users to prefix 0 for landline to mobile calls from Jan 15

డయలింగ్ ప్యాట్రన్ మార్చడం వల్ల భవిష్యత్తు అవసరాల కోసం 2544 మిలియన్ల నెంబర్లు అదనంగా లభించనున్నాయి. ట్రాయ్ మే 29, 2020న సిఫార్సు చేయగా, డిపార్టుమెంటు దీనికి ఓకే చెప్పింది. అయితే ముందు జీరో యాడ్ చేయడం నేపథ్యంలో ఫోన్ నెంబర్ల అంకెలను పెంచడం కాదని తెలిపింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+