అన్ని కంపెనీలదీ ఒకటే మాట... అది సాధ్యం కాదట.. ఫిర్యాదులు పెరుగుతాయట !
టెలికాం కంపెనీలు ఒక్కటయ్యాయి. ఇప్పటిదాకా కొన్ని విషయాల్లో ఉప్పు నిప్పులా ఉన్న ఈ కంపెనీలు ఇప్పుడు మాత్రం ఒకే పల్లవి అందుకున్నాయి. టెలికాం రంగ నియంత్రణ సంస్థ చెప్పిన పని చేయడం సాధ్యం కాదని, ఒకవేళ అలా చేస్తే తమకు ఇబ్బందులు పెరుగుతాయని కొత్త రాగం అందుకున్నాయి.

అసలు విషయం ఏమిటంటే?
టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు అనేక రకాల ప్లాన్లు అఫర్ చేస్తున్నాయి. వీటిలో అన్నిటి గురించి కస్టమర్లకు తెలియదు. కొన్ని ప్లాన్లకు సంభందించిన వివరాలను మాత్రమే టెలికాం కంపెనీలు పామ్ప్లెట్స్ ద్వారా వెల్లడిస్తుంటాయి. తమ సంస్థకు సంబందించిన మొబైల్ యాప్ లలో మిగతా ప్లాన్లను తెలియజేస్తాయి. కొన్ని ప్లాన్లు ఆఫర్ లో లేకున్నా అవి యాక్టివ్ గానే ఉంటాయి. కొన్ని ప్లాన్లు కొంత మంది కస్టమర్ల కు అందుబాటులో ఉంటాయి. అయితే ఈ ప్లాన్ల విషయంలో పారదర్శకంగా ఉండాలని, అన్ని ప్లాన్ల వివరాలను ప్రకటించాలని ట్రాయ్ టెలికం కంపెనీలకు సూచించింది. అయితే ఈ విషయంలో టెలికం కంపెనీలు చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. అన్ని ప్లాన్ల వివరాలు వెల్లడించడం వల్ల కస్టమర్లతో గందరగోళం పెరుగుతుందని, అంతే కాకుండా కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతాయని కంపెనీలు అంటున్నాయి. రిలయన్స్ జియో సహా ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు ఈ విషయంలో ఒకటే మాట అంటున్నాయి. ఇంతకు ముందు ఈ కంపెనీలు వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవి. ఇప్పుడు మాత్రం తాజా అంశంలో అన్నింటిదీ ఒకటే మాటగా ఉంది.

కంపెనీలు ఏమంటున్నాయంటే..
కొత్త కస్టమర్లకు అందుబాటులో లేని ప్లాన్ వివరాలను కూడా అన్ని ప్లాన్లతో కలిపి ప్రకటిస్తే కస్టమర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుందని ట్రాయ్ కి రిలయన్స్ జియో తెలిపింది. ఇలాంటి తరుణంలో ట్రాయ్ కి అనవసర ఫిర్యాదులు పెరిగే అవకాశం ఏర్పడే ఆస్కారం ఉంటుందని చెబుతోంది.
ఎయిర్‌టెల్ కూడా ఇదే మాట చెబుతోంది. ఆఫర్ లో లేని ప్లాన్లను ప్రకటించడం వల్ల కస్టమర్లు అసంతృప్తి చెందుతారని, ఇది టెలికాం కంపెనీల కాల్ సెంటర్ నాణ్యతను ప్రభావితం చేస్తుందని పేర్కొంది.
ఉపసంహరించుకున్న చాలా ప్లాన్ల వివరాలు తెలియజేయడం వల్ల చాలా వృధా అవుతుందని, వినియోగదారుల్లో అనవసర గందరగోళం పెరుగుతుందని వోడాఫోన్ ఐడియా అంటోంది.

ప్రత్యామ్నాయ మార్గాలు
సామాజిక మాధ్యమాలయిన పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, కంపెనీల సొంత యాప్స్ ద్వారా సమాచారాన్ని అందించే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నట్టు టెలికం కంపెనీలు ట్రాయ్ దృష్టికి తెచ్చాయి. అయితే వీటిలోనూ స్క్రీన్ పరిమాణం, క్యారక్టర్ ఉన్నట్టు పేర్కొంది. అయితే వీటి ద్వారా కీలకమైన సమాచారాన్ని కస్టమర్లకు అందించే అవకాశం ఉంటుందన్న విషయం తెలియజేశాయి.


Click it and Unblock the Notifications