విశ్వనగరంగా ప్రఖ్యాతిగాంచిన హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పలుకు ప్రాజెక్టులు చేపడుతోంది. ప్రజల జీవన విధానాన్ని మరింత సులభతరం చేసేందుకు కీలక పథకాలు ప్రవేశపెడుతోంది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మరింత పటిష్ఠంగా మారుతుందని భావిస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం త్వరలో కామన్ మొబిలిటీ కార్డు ప్రారంభించనుంది. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక కీలక ముందడుగుగా మారనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండో వారం నుంచి ఈ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది అని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కామన్ మొబిలిటీ కార్డు ద్వారా మెట్రో ట్రైన్, ఆర్టీసీ బస్సుల్లో సులభంగా ప్రయాణించవచ్చు. ఇది గనుక సక్సెస్ అయితే లోకల్ ట్రైన్స్, క్యాబ్స్, షేర్ ఆటోలు, రిటైల్ సంస్థలకూ ఈ సేవలను క్రమంగా విస్తరిస్తామని MAUD ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ అందుబాటులో ఉన్న ఇతర నగరాల్లో సైతం ఈ కార్డును వినియోగించవచ్చని ట్వీట్ చేశారు. అన్ని ప్రయాణ అవసరాల కోసం సింగిల్ కార్డుగా ఉపయోగపడుతుందన్నారు.
మొదటగా హైదరాబాదులో ప్రారంభించిన అనంతరం తెలంగాణ వ్యాప్తంగా ఈ సేవలను విస్తరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. భవిష్యత్తులో ఈ కార్డులను కేవలం ప్రయాణానికి మాత్రమే కాకుండా ఇతర లావాదేవీల కోసం కూడా ప్రజలు ఉపయోగించుకునేలా మార్పులు చేయాలని చూస్తోంది. తద్వారా ప్రయాణ చెల్లింపులను క్రమబద్ధీకరిస్తూ, ప్రజా రవాణా ఎక్స్పీరియన్స్ ను మెరుగుపరచడం లక్ష్యంగా ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications