రూ. వెయ్యి కోట్లు టార్గెట్..రాజీవ్ స్వగృహ వేలానికి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవిగో..

తెలంగాణలో అట్టడుగు మధ్యతరగతికి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్తను అందించింది.సామాన్యులకు అందుబాటులో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్‌మెంట్ టవర్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనేక ఏళ్లుగా అసంపూర్తిగా ఉండి ఖాళీగా ఉన్న ఫ్లాట్లను ఇప్పుడు బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 11 ప్రాంతాల్లో పూర్తి అయిన నిర్మాణాలు, ఇంకా పాక్షికంగా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను అమ్మనున్నారు. బండ్లగూడ, పోచారం, గాజులరామారం వంటి ప్రాంతాల్లో ట్రిపుల్ బెడ్ రూమ్ డీలక్స్, ట్రిపుల్ బెడ్ రూమ్, డబుల్ బెడ్ రూమ్, సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు ప్రస్తుతం వేలానిక అందుబాటులో ఉన్నాయి.ఈ అమ్మకాల ద్వారా రూ.1,000 కోట్లకు పైగా ఆదాయం సమీకరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రక్రియ మొదలైంది. ఈ క్రమంలో మేడ్చెల్-మల్కాజిగిరి జిల్లాలోని మూడు టౌన్‌షిప్‌లలో ఉన్న ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు.

Telangana s Rs 1 000 Cr Plan Telangana Rajiv Swagruha flats Rajiv Swagruha sale Telangana government housing sale vacant flats Telangana Telangana real estate news Hyderabad Rajiv Swagruha Rajiv Swagruha auction Telangana to raise 1000 crore Rajiv Swagruha unsold flats Telangana property sale news 1000

పోచారంలో వేలానికి వచ్చేవి ఇవే: 2 టవర్లు, ఒక టవర్‌లో 122 ఫ్లాట్లు (ఎస్ఎఫ్‌టీకి రూ.1,650 ధర) - మొత్తం విలువ రూ.30 కోట్లు, డిపాజిట్ రూ.2 కోట్లు. మరో టవర్‌లో 72 ఫ్లాట్లు (ఎస్ఎఫ్‌టీకి రూ.1,650) - మొత్తం విలువ రూ.13.78 కోట్లు, డిపాజిట్ రూ.1 కోటి.

గాజులరామారం వేలానికి వచ్చేవి ఇవే: రెండు టవర్లు, ఒక్కో టవర్‌లో 112 చొప్పున మొత్తం 224 ఫ్లాట్లు. ఒక్క ఎస్ఎఫ్‌టీ ధర రూ.1,995 - ఒక్కో టవర్ విలువ రూ.26.33 కోట్లు, డిపాజిట్ రూ.2 కోట్లు. డిపాజిట్ రుసుము వచ్చే నెల 19వ తేదీ వరకు చెల్లించాల్సి ఉంటుంది. 20న లాటరీ ద్వారా ఫ్లాట్ అల్లాట్‌మెంట్ నిర్ణయిస్తారు.

హౌసింగ్ బోర్డు ఓపెన్ ప్లాట్లు వేలం: తెలంగాణ హౌసింగ్ బోర్డు పరిధిలోనూ ఖాళీగా ఉన్న ప్లాట్లను ఈ-ఆక్షన్ ద్వారా విక్రయించనున్నారు. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ (KPHB) - 4వ ఫేజ్ లో గల 4,598 గజాల ఓపెన్ ప్లాట్ అలాగే 2,420 గజాల ఓపెన్ ప్లాట్ విక్రయానికి రానుంది. నాంపల్లిలో 1,148 గజాల ఖాళీ స్థలం కూడా వేలానికి రానుంది. ఈ ప్లాట్లను జూలై 30న వేలం వేయనున్నారు. ఇప్పటికే వీటి సంబంధిత నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

ఈ ఫ్లాట్లకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తులు సమర్పించాలి. ఒకే ప్రాపర్టీకి అనేక మంది దరఖాస్తు చేస్తే, లాటరీ ద్వారా అల్లాట్‌మెంట్ నిర్ణయిస్తారు. ఇందుకు జూలై 30, ఆగస్ట్ 1, 2, 20 తేదీల్లో డ్రా నిర్వహిస్తారు. ఈ ఫ్లాట్లు సుమారు 15 ఏళ్ల క్రితం నిర్మించబడ్డాయి. గృహావసరాలను అందుబాటులోకి తేవడం కోసం మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకొని రాజీవ్ స్వగృహ పథకాన్ని రూపొందించారు. కానీ 2007లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుండి ఆరు దఫాల వేలంపాటలు జరిగినా, వందలాది ఫ్లాట్లు, వేలాది ప్లాట్లు అమ్ముడుపోక ఉన్నాయి.

ప్రస్తుతం అమ్మకానికి పెట్టిన ఫ్లాట్ల విస్తీర్ణం 520 చదరపు అడుగుల నుండి 1,600 చదరపు అడుగుల వరకు ఉంది. ధర చదరపు అడుగుకు రూ.2,500 నుండి రూ.4,000 మధ్యగా నిర్ణయించారు. ఇప్పటికే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో 18 ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. వాటిలో ఒక్కో గజానికి రూ.2.98 లక్షలు వచ్చాయి. ఈ విక్రయాల ద్వారా రూ.142.78 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే గచ్చిబౌలి, చింతల్, నిజాంపేటలో జరిగిన విక్రయాల ద్వారా రూ.65.02 కోట్లు రాబట్టారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డ్ వైస్ ఛైర్మన్ వి ఓ పీ గౌతమ్ మాట్లాడుతూ, అన్ని అమ్మకాలు పూర్తి పారదర్శకంగా ఈ-ఆక్షన్ ద్వారా జరుగుతాయని తెలిపారు. తద్వారా అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయన్నారు. చివరి ఈ-ఆక్షన్ జూలై 30న జరగనుంది. మరిన్ని వివరాలకు ఆసక్తి ఉన్న వారు [www.tghb.cgg.gov.in](http://www.tghb.cgg.gov.in) వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా వైస్ ఛైర్మన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+