Verify URL: ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మోసగాళ్ల లీలలు కోకొల్లలు. అయితే ఈ మాయగాళ్ల వలలో మోసపోయిన టెక్కీ తనలా ఎవరికీ జరగకూడదనే సదుద్దేశం నుంచి పుట్టిందే వెరిఫై యూఆర్ఎల్ యాప్.
మనం చాలా సార్లు తప్పుడు లింక్స్ నొక్కి డబ్బులు పోగొట్టుకున్నారు. నకిలీ వెబ్ సైట్లతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసి డబ్బు దోచేస్తున్నారు అంటూ వార్తలు వింటూనే ఉంటాం. అయితే వీటిలో ఉండే తేడాలు, అసలు-నకిలీలకు మధ్య వ్యత్యాసాలు బాగా చదుకువుకున్న వారికి కూడా తెలియవని చెప్పటం అతిశయోక్తికాదు. పైగా ఇలాంటి నకిలీల బారినపడేవారిలో విద్యావంతులే అత్యధికంగా ఉండటం ఆందోళనల స్థాయికి అద్ధం పడుతోంది.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ చలానాలను రాయితీతో చెల్లించేందుకు ఒక ప్రకటన చేయగా.. మాయగాళ్లు దానికి నకిలీ వెబ్‌సైట్ విషయం బయటపడింది. అయితే గతంలో నకిలీల బారిన పడిన కడియాల గోపీ అనే టెక్కీ ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని, తనలాగా ఎవరూ మోసపోకుండా కాపాడాలని నిర్ణయించుకున్నాడు. అలా తెలంగాణలోని కొత్తగూడెంకు చెందిన టెక్కీ బీటెక్ చదువుతున్న క్రమంలో రూ.కోటి లాటరీ తగిలిందంటూ ఒక మెయిల్ పొందాడు. అయితే ఇది చూసి నిజమే అనుకున్న అతడు వారు అడిగినట్లుగా రూ.25 వేలు వారు పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు జమ చేశాడు. ఆ తర్వాత అర్థమైంది తాను మోసపోయానని.
అయితే అలా పుట్టిందే వెరిఫై యూఆర్ఎల్ ఆలోచన. ప్రస్తుతం చాలా కంపెనీలు, బ్యాంకులు, షాపింగ్ యాప్స్, ఈకామర్స్ వెబ్ సైట్లు ఇలా అనేక సంస్థలు తమ ప్రమోషన్ మెయిల్స్ పంపుతున్నాయి. అయితే వీటి మాటునే సైబర్ నేరగాళ్లు తమ దందా కూడా ఫేక్ వెబ్‌సైట్ల ద్వారా నడిపించేస్తున్నారు. అయితే వారు ఇచ్చిన లింక్స్ క్లిక్ చేస్తే ఆఫర్ల సంగతి పక్కనపెడితే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పోతాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు ఫోన్‌కు వచ్చిన కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌దేనా లేక ఫేక్‌దా తెలుసుకునేందుకు యువ టెక్కీ గోపీ రూపొందించిన 'వెరిఫై యూఆర్ఎల్'(verify URL)యాప్ అద్బుతంగా ఉపయోగపడుతుంది. యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=in.verifyurl
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి పొంది దేశవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులే కాక ప్రముఖ షాపింగ్ మాళ్లు, పలు రాష్ట్రాల అధికార వైబ్‌సైట్లు 6 వేలకుపైగా అడ్రస్లు, ఐడీలను ప్రస్తుతం గోపీ తన యాప్‌లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుతం ఈ యాప్ పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంది. రాబోయే కాలంలో మరిన్ని వెబ్ సైట్ యూఆర్ఎల్స్ ఇందులో చేర్చేందుకు గోపీ కృషి చేస్తున్నాడు. తాను రూపొందిన యాప్ ద్వారా కేవలం సెకన్ల వ్యవధిలోనే సైట్ వివరాలు పొందేలా దీనిని తయారు చేశాడు. సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో కలర్స్‌తో కూడిన రిజల్ట్స్ యాప్ అందిస్తోంది. గ్రీన్ కలర్ వస్తే సేఫ్ వెబ్సైట్ అనీ అలాగే రెడ్ కలర్ వస్తే జాగ్రత్తపడాల్సి ఉంటుందని యాప్ సూచిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications