రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రతతో పాటు ఆర్థిక రక్షణ కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సుమారు ఐదు గంటల పాటు విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన రెండు ప్రధాన సంక్షేమ పథకాలతో పాటు వైద్య, మౌలిక వసతులు, మెట్రో, నీటి సరఫరా, విద్య, పట్టణాభివృద్ధి రంగాల్లోనూ కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉద్యోగుల ప్రమాద బీమా పథకం కింద దేశంలో ఎక్కడా లేనివిధంగా 7.57 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బీమా వర్తింపజేయనున్నారు. ప్రమాదంలో మరణిస్తే రూ.1.25 కోట్ల బీమా మొత్తం, 60 ఏళ్ల లోపు సహజ మరణం సంభవిస్తే రూ.10 లక్షల ప్రయోజనం అందించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2.38 లక్షల మంది పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే ఈ పథకం లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే సింగరేణి, విద్యుత్ సంస్థల్లో అమలులో ఉన్న టర్మ్ ఇన్సూరెన్స్‌ను ఇకపై ఉద్యోగులందరికీ వర్తింపజేయనున్నారు.

అదేవిధంగా ఉద్యోగ సంఘాల దీర్ఘకాలిక డిమాండ్ మేరకు క్యాష్‌లెస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 3.56 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు కలిపి మొత్తం 17.07 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స అందించనున్నారు. ఉద్యోగులు మూల వేతనం నుంచి 1.5 శాతం చెల్లిస్తే, ప్రభుత్వం సమాన వాటా చెల్లించనుంది.
వైద్య శాఖలో సంస్కరణల దిశగా తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చే బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు నిధులు, సిబ్బంది, ఔషధాల సరఫరా మరింత బలోపేతం కానుంది. ఆసుపత్రుల నిర్వహణపై అధ్యయనం చేసేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు.
పట్టణాభివృద్ధిలో భాగంగా HMDA విస్తరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాలను HMDA పరిధిలోకి తీసుకురానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో రూ.3,145 కోట్లతో సీఆర్‌ఎంపీ-2 కింద 300 కి.మీ. అదనపు రోడ్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. అలాగే మంజీరా, ఉస్మాన్‌సాగర్ తాగునీటి పథకాల ఆధునీకరణకు రూ.1,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది.
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశను మార్చి 31లోగా ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. మొత్తం రూ.15 వేల కోట్ల వ్యయంతో మెట్రోను ప్రభుత్వం స్వంతం చేసుకోనుంది. ఫేజ్-2లో 160 కి.మీ.కు పైగా మెట్రో విస్తరణకు కేంద్రానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినట్లు తెలిపింది.
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మార్చి 16 నుంచి ప్రారంభం కానుండగా, మే 11 నుంచి జనగణన తొలి దశ చేపట్టనున్నారు. కోహెడలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు, ఇంజినీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి భూముల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించింది.
More From GoodReturns

Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026: సామాన్యుడికి ఊరట కలిగేనా?

New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications